ఘోర రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి...
ఘోర రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి...
పెబ్బేరు, ఏప్రిల్ 06 (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
హైదరాబాద్ బెంగళూరు హైవే పై పెబ్బేరు మండల రంగాపూర్ శివారు సమీపంలో హైదరాబాదు నుంచి కర్ణాటక కు వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకెళితే... కర్ణాటక బళ్లారి ప్రాంతానికి చెందిన సంగయ్య కొడుకు వినాయక (25 సంవత్సరాలు) హైదరాబాదులోని జెన్ ఫ్యాక్ట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రోజు ఉగాది పండుగ నిమిత్తం సెలవులకు ఊరికి బయలుదేరాడు. హైదరాబాద్- బెంగళూరు 44-NH హైవే పై పెబ్బేరు మండల రంగాపూర్ శివారు సమీపంలో బైకు అదుపుతప్పి పడిపోయాడు. అతను తలకు హెల్మెట్ పెట్టుకున్న కూడా దురదృష్టవషత్తు గుర్తుతెలియని వాహనం అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. ఈ ఘటన మధ్యాహ్నం 1:44 గంటల సమయంలో సంభవించిందని పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వాహనం కోసం వెతుకుతున్నామని తెలిపారు.