నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచలప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.