తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే?
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే?
హైదారబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
మొన్నటి వరకు పరీక్షలతో బిజీగా ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 20వ తేదీ తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైంది. ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీకి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. మార్చి 10 నుంచే ప్రారంభమైన సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 10తో పూర్తైంది. మొత్తం 4 విడతల్లో మూల్యాంకనం చేశారు.
ఆన్‌లైన్‌లో మార్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 20 తర్వాత ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. కాగా అటు ఏపీలో ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. త్వరలో పదో తరగతి ఫలితాల విడుదాలకు సన్నాహాలు చేస్తోంది.