త్వరలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు...
త్వరలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు...
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈ నెల 20వ తేదీ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 4 విడతల్లో మూల్యాంకనం నిర్వహించి ఈ నెల 10వ తేదీన పూర్తి చేశారు. ప్రస్తుతం నమోదైన మార్కుల పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు విడుదల కానున్నాయి. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇలా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మార్చి 10వ తారీఖు నుంచి అధికారులు మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.