పెరుగుతున్న ఉష్ణోగ్రతలు...వడదెబ్బ అంటే....?వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.?
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు...
వడదెబ్బ అంటే....?
వడదెబ్బ
తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.?వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అ జాగ్రత్తతో బయటకు తిరిగే వ్యక్తులు వడదెబ్బకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మండే వేసవి కాలం లో తగు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా ఉండవచ్చని వడదెబ్బకు గురికాకుండా మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...
వడదెబ్బ అంటే....?
ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మనిషి శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్ర మండల నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో వడదెబ్బ వస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతుంది. వడదెబ్బ తగిలిన వారిలో 40 శాతం మరణాలు సంభవిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనది. వేసవి కాలంలో సాధారణంగా అపాయానికి గురి చేసేది ఈ వడదెబ్బే. దానిని సన్స్ట్రోక్ లేదా హీట్ స్ట్రోన్ అని కూడా అంటారు. తీవ్రస్థాయిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కనుక వడదెబ్బ తగిలిన వ్యక్తికి తక్షణమే వైద్య సహాయం అందించాలి.
లక్షణాలు:-
తలనొప్పి, తలతిరడం, నాలిక ఎండిపోవడం/పిడచ కట్టుకుపోవడం / చెమట పట్టకుండా ఉండటం, జ్వరం కలిగి ఉండటం, మగత కలవరింతలు, ఫిట్స్/పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి
కారణాలు:-
శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం, శరీరం ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
చేయాల్సిన పనులు:-
వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి. అతని శరీరం పై ఉండే దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగడం కానీ చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవడం చేయాలి. ఐస ముక్కలను గుడ్డతో ఉంచి శరీరాన్ని తుడిచి చల్లని గాలి తగిలేలా చూడాలి. రోగ గ్రస్తులకు చల్లని నీరు లేదా ఉప్పు ఇతర లవణాలు కలిపిన నీటిని తాగించాలి. ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించాలి.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
👉సాధ్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరగకుండా జాగ్రత్త వహించాలి.
👉తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఉప్పు కలిగిన పళ్ల రసాలు తాగి బయలుదేరాలి.
👉వేసవి కాలంలో తెల్లని దుస్తులు ధరించాలి. నల్లని వస్త్రాలు ధరించకూడదు.
👉ఆల్కహాలు సేవించడం వల్ల రక్తనాళాలు వ్యాకో చించి ఎక్కువ చెమట వచ్చేలా చేస్తాయి. అది విషమ పరిస్థితికి దోహదం చేస్తుంది. కనుక ఆల్క హాలు సేవించరాదు.
👉ఇంటి గదులు ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కిటికీ లకు, తలుపులకు తెరలను వాడి వేడిని తగ్గించ వచ్చు. ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిష నర్లు వాడాలి.
👉వేడిగా ఉన్నప్పుడు ఎండలో గొడుగు లేకుండా తిరుగరాదు.
👉తప్పనిసరి పరిస్థితుల్లో మండటెండలో బయ టకు వెళ్లాలంటే మంచి నీటి బాటిల్ను వెంట తీసు కెళ్లాలి.
👉వేసవి కాలంలో బయటకు వెళ్లే అవసరం ఉంటే ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి.
👉ఎండలో వెళ్లేటప్పుడు తలకు తెల్లని టోపి లేక రుమాలు ధరించాలి.