కిలో చింతచిగురు ధర రూ.700
కిలో చింతచిగురు ధర రూ.700
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
చింత చెట్ల ఆకులు రాలిపోయాక, వచ్చిన చిగురును వంటకాల్లో ఉపయోగిస్తారు. దాంతో చేసిన పప్పు, మాంసం వంటకాలను భోజన ప్రియులు ఇష్టంగా తింటారు.అలా శనివారం మార్కెట్లో చింత చిగురు అమ్మకానికి వచ్చింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ హోల్సేల్, రిటైల్ మార్కెట్లో రైతుబజార్లలో రైతులు రెండు, మూడు రోజులుగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గుడిమల్కాపూర్ రిటైల్ మార్కెట్లో కిలో రూ.500- రూ.600 పలుకుతోంది. మెహిదీపట్నం రైతుబజార్ లో శనివారం కిలో చింత చిగురు రూ.700 పలికింది. చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి ప్రాణాలకు తెగించి సేకరిస్తామని రైతులు చెబుతున్నారు.బహిరంగ మార్కెట్లో 100 గ్రాములు రూ.100కు అమ్ముతున్నారని. సెలవు దినాలు, ముఖ్యంగా ఆదివారం గిరాకీ ఎక్కువగా ఉంటుందని మెహిదీపట్నం రైతుబజార్ ఎస్టేట్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు.