పసిడి ధరలు భగ భగ...ఆల్ టైం రికార్డ్ 70 వేల మార్క్ దాటిన గోల్డ్...
పసిడి ధరలు భగ భగ...ఆల్ టైం రికార్డ్ 70 వేల మార్క్ దాటిన గోల్డ్...
ముంబాయి, (పీపుల్స్ మోటివేషన్):-
దేశంలో పసిడి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్ టైం రికార్డ్ చేరుకుంటున్నాయి. తాజాగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.70 వేల మార్క్ను దాటింది. మార్కెట్ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. ఇక వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.82,000 చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు బలపడుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.