ఎన్నికల వేళ భారీ ఎన్ కౌంటర్ 29కి పెరిగిన మృతుల సంఖ్య... మృతులలో మావోయిస్టు కీలక నేతలు!
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
5 latest news headlines
latest news world
By
Peoples Motivation
ఎన్నికల వేళ భారీ ఎన్ కౌంటర్ 29కి పెరిగిన మృతుల సంఖ్య... మృతులలో మావోయిస్టు కీలక నేతలు!
కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
కల్పర్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్ కు మధ్య కాల్పులు
మృతుల్లో డివిజనల్ కమిటీ మెంబర్లు శంకర్ రావు, లలిత
మరో 10 రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా.. ఛత్తీస్ గడ్ లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్రావు కూడా ఉన్నాడని, అతడి మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం.
బీఎస్ఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటేబేథియా పీఎస్ పరిధిలోని హపటోలా అటవీ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఎన్ కౌంటర్ మొదలైందని బీఎస్ఎఫ్ తెలిపింది. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. కాంకేర్ లోక్సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు.
Comments