24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
Ts inter results 2024,
Ts inter general results,
Ts inter first year results,
ts inter second year results,
Telangana inter vocational results 2024
By
Peoples Motivation
24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 22 (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ విడుదల చేస్తారని ప్రకటించింది. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఇక ఈ ఏడాది దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 4.78 లక్షల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉంటే.. 4 లక్షలకు పైగా ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ ఉన్నారు. వీరందరూ పరీక్ష ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫలితాల కోసం కింది వెబ్సైట్లను సందర్శించగలరు tsbie.cgg.gov.in, results.cgg.gov.in
Comments