-Advertisement-

24 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు

inter supplementary exam fee 2024 ap inter supplementary exam fee 2024 ap intermediate supplementary exam fee online payment 2024 ap inter supplementa
Peoples Motivation

24 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు

INTERMEDIATE SUPPLYMENTARY EXAM FEES DATES
అమరావతి, ఏప్రిల్ 14 (పీపుల్స్ మోటివేషన్):-

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 18 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. జనరల్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు రూ.550, ప్రాక్టికల్స్ కు రూ.250, బ్రిడ్జి కోర్సు పేపర్లు రాసేందుకు రూ.150 చెల్లించాలని సూచించింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్కుల మెరుగుదలకు మళ్లీ పరీక్షలు రాయాలనుకుంటే.. పరీక్ష ఫీజు రూ. 550తో పాటు ఒక్కో పేపర్కు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాలని పేర్కొంది. జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కు రూ.1,300, రీకౌంటింగ్కు రూ.260 చొప్పున ఈ నెల 18 నుంచి 24 వరకు చెల్లించాలని సూచించింది. ఈ నెల ఏప్రిల్ 12వ తేదీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. 

Comments

-Advertisement-