ఏపీ 2024 ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల పూర్తి సమాచారం
ఏపీ 2024 ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
- పాసయిన విద్యార్థులకు అభినందనలు..
- ఫెయిలైనా విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయండి..
- ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు..
- విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి
- ఇంటర్మీడియట్ బోర్డ్
అమరావతి, ఏప్రిల్ 12 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది. సెకండ్ ఇయర్ లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. రెండో స్థానం గుంటూరు. మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.
మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పరీక్షలకు సంబంధించి వివరాలు ఇలా..
పరీక్షలకు 10,53,435 మంది విద్యార్థులు హాజరయ్యారు.
సరికొత్త టెక్నాలజీతో లీకేజ్ కీ అడ్డుకట్ట వేశాం
సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు.. జరిపామని
పాసయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అభినందనలు తెలియజేసింది.
ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయండి. ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు..ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి అని తెలిపారు.
సప్లిమెంటరీ పరీక్షలు....
మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి.