2024–25 అకడమిక్ క్యాలండర్ విడుదల...జూన్ 1న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం
2024–25 అకడమిక్ క్యాలండర్ విడుదల...జూన్ 1న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం
అమరావతి, ఏప్రిల్ 08 (పీపుల్స్ మోటివేషన్):-
వచ్చే విద్యా సంవత్సరానికి ( 2024-25 )సంబంధించి జూన్ ఒకటి నుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ కు సంబంధించిన 2024-25 విద్యా క్యాలెండర్ ను ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. త్రైమాసిక పరీక్షలు సెప్టెంబరు 23 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. అనంతరం అక్టోబరు 3 నుంచి 11వరకు దసరా సెలవులు ఇస్తారు. అర్థ సంవత్సరం పరీక్షలు డిసెంబరు 16 నుంచి 21 వరకు ఉంటాయి. ఆ తర్వాత సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 18 వరకు ఉంటాయి. 20న కళాశాలలు పునః ప్రారంభమవుతాయి. ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిర్వహిస్తారు. పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు 2025 ఫిబ్రవరి రెండో వారంలో ఉంటాయి. పబ్లిక్ థియరీ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహిస్తారు. విద్యా సంవత్సరం 2024-25 మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి.