ఏపీ లాసెట్/ పీజీఎల్ సెట్-2024...వెబ్ సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ లాసెట్/ పీజీఎల్ సెట్-2024
ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) / పోస్ట్ గ్రాడ్యుయేట్ లానెట్ (ఏపీ పీజీఎల్సెట్) 2024 నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం/ ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
కోర్సులు
మూడేళ్లు/ ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం/ ఎంఎల్.
అర్హత
కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్ఎల్బీ, పీజీ.
దరఖాస్తు ఫీజు
ఎల్ఎల్బీ కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.900. బీసీలకు 850. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.800. ఎల్ఎల్ఎం కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.1000, బీసీలకు రూ.950. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.900.
పరీక్ష
అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఎల్ఎల్బీ కోర్సులకు పరీక్ష ఇంగ్లిష్, తెలుగు రెండు మాధ్యమాల్లో; ఎల్ఎల్ఎం పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-04-2024
దరఖాస్తుల సవరణ తేదీలు: మే 30 నుంచి జూన్ 1 వరకు.
హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 03-06-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 09-06-2024.
👉👉వెబ్ సైట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి