ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్థులు...
appsc group 2 prelims qualifying marks
appsc group 2 notification
appsc group 2 syllabus
group 2 results 2024 date
group 2 results date
appsc group 2
By
Peoples Motivation
ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 అభ్యర్థులు...
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం వేచి చూస్తున్నామని.. వీలైనంత త్వరగా ప్రకటిస్తే మెయిన్స్ కు ప్రిపేర్ అవుతామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. శనివారం లోపే ఈ ఫలితాలు విడుదలవుతాయని భావించినా ఇప్పటికీ రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. APPSC Group 2 Prelims ఫలితాలు త్వరగా విడుదల చేయాలని'పరీక్ష జరిగి 42 రోజులైంది.. ఫలితాలు రెడీగా ఉన్నాయని పది రోజుల నుంచి అదిగో ఇదిగో అని చెప్పడమే కానీ. ఎలాంటి స్పష్టత లేదు. దయచేసి రిజల్ట్స్ త్వరగా ప్రకటించండని ఫలితాల వెల్లడిలో జాప్యమెందుకు అంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
Comments