-Advertisement-

ఏప్రిల్ 18వ తేదిన నోటిఫికేషన్ విడుదల... అదే రోజు ఉదయం 11గం.ల నుండి నామినేషన్లు స్వీకరణ

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

ఏప్రిల్ 18వ తేదిన నోటిఫికేషన్ విడుదల

అదే రోజు ఉదయం 11గం.ల నుండి నామినేషన్లు స్వీకరణ

-జిల్లా కలెక్టర్ /జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన

Latest news in Telugu
కర్నూలు, ఏప్రిల్ 15 (పీపుల్స్ మోటివేషన్):-

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 18వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, అదే రోజు ఉదయం 11గం.ల నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.

సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఫార్మ్ లను ఈరోజు సాయంత్రం నుండి ఇవ్వడం జరుగుతుందని, రాజకీయ పార్టీ ప్రతినిధులు వచ్చి ఫలానా అభ్యర్థి కోసం ఫార్మ్ తీసుకొని వెళ్తున్నామని సంతకం చేసి తీసుకొని వెళ్లాలన్నారు. ఏప్రిల్ 18వ తేది ఉదయం గం.ల నుండి మ.3గం.లలోపు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.. నామినేషన్ల వేయడానికి వచ్చే వారి వాహనాలను రెండు వందల మీటర్ల దగ్గరే ఆపి వేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులకు మాత్రమే నామినేషన్ వెయ్యడానికి అనుమతి ఉంటుందన్నారు. పబ్లిక్ హాలిడేల్లో, ఆదివారం రోజున నామినేషన్లు స్వీకరించడం జరగదని కలెక్టర్ వివరించారు..

ఈ నెల 12వ తేదిన ఈవిఎంల రాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ఈవీఎంలను అన్ని నియోజకవర్గాలకు పంపడం జరిగిందన్నారు.. ఆయా నియోజక వర్గాల్లో ఈవిఎంలను సిసి కెమెరాల పర్యవేక్షణలో భద్రత మధ్య ఉంచడం జరిగిందన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు వచ్చే నెల 2వ తేది నుంచి 5వ తేది వరకు ఈవిఎంలను కమీషనింగ్ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా బ్యాలెట్ యూనిట్ మీద బ్యాలెట్ పేపర్లు అతికించడం, వివిప్యాట్స్ లో సింబల్స్ లోడ్ చేయడం, పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం జరుగుతుందన్నారు.. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొనాలన్నారు. 

పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఈ రోజు చివరి రోజు అని, ఇప్పటి వరకు 14వేల వరకు దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఎసెన్షియల్ సర్వీసెస్, ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వర్తిస్తుందని, అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగుల చేతికి ఇవ్వడం జరగదన్నారు.. పోస్టల్ బ్యాలెట్ ను పోస్ట్ లో పంపించే పద్ధతి ఉండదన్నారు.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా ఇదే విధానం అమలు కానుందన్నారు. ప్రతి ఆర్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ కౌంటర్లోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలన్నారు...ఈ మేరకు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వారికి మాత్రమే పోస్టు ద్వారా రావడం జరుగుతుందన్నారు. 

హోమ్ ఓటింగ్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు రాలేని వారు ఎంత మంది అనేది ఒక అంచనాకు రావడం జరిగిందని, అందుకు సంబంధించిన ఫార్మ్ ల ను ఏప్రిల్ 18వ తేది నుంచి 21వ తేది వరకు బిఎల్ఓల ద్వారా మాత్రమే స్వీకరించడం జరుగుతుంది తప్ప ఇతరులు ఇచ్చే ఫార్మ్ ను గుర్తించబోమన్నారు.. వీరి కోసం వారి ఇంటి వద్దే ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని, సదరు ఓటు హక్కును వినియోగించుకునే వారు ఎంత మంది అన్న వివరాలను కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద 60 సం.లు పైబడిన వారు, విభిన్న ప్రతిభావంతులు, గర్భిణీ స్త్రీలు క్యూ ల్లో నిలబడకుండా త్వరితగతిన వారి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మే 10వ తేదిలోపు ఓటర్ స్లిప్స్ లను మేమే పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు... అనధికారికంగా ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు..

సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ లు, ఇంస్టాగ్రామ్, ఫేక్ బుక్, యూట్యూబ్, ఎలక్రానిక్ మీడియా, కేబుల్ టీవీల్లో స్క్రోల్స్, సినిమా హాళ్లలోనూ, ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలలో, ఎలక్ట్రానిక్ పత్రికలలో రాజకీయ ప్రకటనల ప్రసారానికి, అలాగే మొబైల్ నెట్వర్క్ లో బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజ్ లకు అభ్యర్థులు స్టేట్ ఎంసిఎంసి లేదా జిల్లా ఎంసిఎంసి నుండి ప్రీ సర్టిఫికేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. కలెక్టరేట్ లోని సీపీఓ కార్యాలయంలో ఎంసిఎంసి సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు..

సమావేశంలో డిఆర్ఓ మధుసూదన్ రావు,.ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మొహమ్మద్ అక్బర్ హుస్సేన్, బిఎస్పీ పార్టీ జిల్లా ఇంఛార్జి జి.అరుణ్ కుమార్, బిజెపి స్పోక్స్ పర్సన్ సాయి ప్రదీప్, సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీ మెంబర్ కె.వి.నారాయణ, టిడిపి లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ ఎల్వీ ప్రసాద్, వైఎస్ఆర్సిపి జిల్లా సెక్రెటరీ ఎస్.రాజేష్ బాబు, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-