ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల పూర్తి వివరాలు.. 17 స్కూలల్లో అందరూ ఫెయిల్..! ఫలితాల్లో చివరి స్థానంలో కర్నూలు జిల్లా
ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల పూర్తి వివరాల...
17 స్కూలల్లో అందరూ ఫెయిల్..!
ఫలితాల్లో చివరి స్థానంలో కర్నూలు జిల్లా
ఉత్తీర్ణులైన 86.69 శాతం మంది విద్యార్థులు
బాలుర ఉత్తీర్ణత: 84.32 శాతం
బాలికల ఉత్తీర్ణత: 89.17 శాతం
పరీక్షలకు 6.23 లక్షల మంది విద్యార్థులు హాజరు
మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగిన పరీక్షలు
పదవ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడ, ఏప్రిల్ 22 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,743 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే 5,34,574 మంది పాసయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32గా నమోదు కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా నమోదైంది. సబ్జెక్టులవారీగా ఫస్ట్ లాంగ్వేజ్లో 96.47%, సెకండ్ లాంగ్వేజ్ 99.24%, థర్డ్ లాంగ్వేజ్ 98.52%, మ్యాథమెటిక్స్ 93.33%, జనరల్ సైన్స్ 91.296%, సోషల్ స్టడీస్ 95.34శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాసిన వారితో పోలిస్తే తెలుగు మీడియంలో పాస్ పర్సంటేజ్ తగ్గింది. తెలుగు మీడియంలో 71.08% ఉత్తీర్ణత నమోదవ్వగా.. ఇంగ్లిష్ మీడియంలో 92.32% ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 2,803 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ వెల్లడించారు. 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని (0%) వచ్చిందని చెప్పారు. ఈ 17 స్కూళ్లలో ఒకే ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉందన్నారు. ఇక 96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా తొలి, 62.47%తో కర్నూలు జిల్లా చివరిస్థానాల్లో నిలిచాయి. ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 94.56, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38 శాతం, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్ హైస్కూళ్లలో 75.42 శాతం విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్ క్లాస్, 5.56 శాతం మంది థర్డ్ క్లాస్లో పాసయ్యారు.
ఆన్లైన్లోనే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు
మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఆన్లైన్లోనే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్సైట్ నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.