-Advertisement-

యువత ఓటు నమోదు చేసుకో...ధరఖాస్తుకు ఏప్రిల్‌ 15 చివరి తేదీ

General elections 2024, Loksabha Elections 2024, new Voters form 6, form 8 application, Assembly Elections 2024, Parliament Elections,MP&MLA Elections
Peoples Motivation

యువత ఓటు నమోదు చేసుకో... ధరఖాస్తుకు ఏప్రిల్‌ 15 చివరి తేదీ

ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం

ఈ ఎన్నికల్లోనే ఓటు వేయవచ్చు

ప్రజాస్వామ్యం కోసం ముందుకు రండి

Voter id application online
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసి మీకు ఇష్టమైన నేతను ఎన్నుకోవచ్చు. ఎన్నికల రోజు ఓటు వేయాలి అంటే ముందుగా మీరు ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి. ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నా తుది ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు వేసేందుకు అనర్హులు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. తుది ఓటరు జాబితాలో పేరు లేని వారు.. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులైన వారు ఏప్రిల్‌ 15వ తేదీలోపు ఓటరుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అన్ని వివరాలు సక్రమంగా ఉంటే తుది ఓటరు జాబితాలో పేరును చేరుస్తారు.

👉కొత్త ఓటు నమోదు కు ఇక్కడ క్లిక్ చేయండి
Comments

-Advertisement-