-Advertisement-

జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

AP 2024 ELECTION DATES election 2024 AP election time from 7 am to by poll election results today live election today election 2024 maharashtra ele
Peoples Motivation

జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు... మొత్తం ఏడు దశల్లో పోలింగ్

నేడు తొలి దశ పోలింగ్

మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు

ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్

EC NOTIFICATION RELEASED ON EXIT POLLS
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-

శుక్రవారం (ఏప్రిల్ 19) దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. 

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల (ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.  మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని ఈసీ పేర్కొంది.

Comments

-Advertisement-