-Advertisement-

Supreme Court# నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడు కి ఉంటుంది... సుప్రీంకోర్టు

Supreme Court judgement PDF Telugu, Supreme Court of India judgements Telugu, Latest judgement of Supreme Court, Online judgements free download,
Peoples Motivation
Supreme Court# నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడు కి ఉంటుంది..సుప్రీంకోర్టు
నిరసనను తెలిపడం ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19(1) (ఏ) కల్పిస్తుంది..

ఆర్టికల్ 370 రద్దును విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది...

-సుప్రీంకోర్టు స్పష్ఠీకరణ
Thumbnails News
ఢిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజం పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఈ వాఖ్యలు చేసింది. ఇతర దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆ దేశాల పౌరులకు శుభాకాంక్షలు చెప్పడం తప్పేమీ కాదని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్న ప్రొఫెసర్ పై కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజం.. ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ ఆగస్టు 5ను జమ్మూ కాశ్మీర్ కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. ఆగస్టు 14న పాకిస్థాన్ కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు. దీంతో కొల్హాపూర్ జిల్లాలోని హట్కనంగలే పోలీస్ స్టేషన్లో హజంపై సెక్షన్ 153ఏ (మతపరమైన ఉద్రిక్తత లను రెచ్చగొట్టడం) కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదును బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. 'పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ పౌరులకు శుభాకాంక్షలు చెప్పడంలో తప్పులేదు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19(1)(ఏ) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. దీనిద్వారా ఆర్టికల్ 370 రద్దును విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. ఆర్టికల్ రద్దు చేసిన రోజును బ్లాక్ డేగా పేర్కొనడం ద్వారా హజం తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతి చర్యనూ సెక్షన్ 153ఏ ద్వారా అడ్డుకుంటే ప్రజా స్వామ్యం మనుగడ సాగించలేదు. చట్టబద్ధ నిరసనను తెలిపే హక్కు ఆర్టికల్ 19(1) (ఏ) కల్పిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య కల్పించిందని' ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments

-Advertisement-