పెద్ధ ఎత్తున RUSF మరియు RPSF విద్యార్థి సంఘాల నాయకులు టీడీపీలో చేరిక
పెద్ధ ఎత్తున RUSF మరియు RPSF విద్యార్థి సంఘాల నాయకులు టీడీపీలో చేరిక
ఎమ్మిగనూరు, మార్చి 10 (పీపుల్స్ మోటివేషన్):-
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన RUSF మరియు RPSF విద్యార్థి సంఘం నాయకులు అఫ్రీది, రఘునాథ్, నరసింహులు, అజయ్, వినయ్ మరియు వారి అనుచరులు సుమారు 300 మంది యువకులు ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు డా బి వి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి టిడిపి పార్టీ కండువాలను కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అధికార వైసీపీ పార్టీ అధికారంలోకి రాక ముందు ప్రతి సంవత్సరం జనవరి నెలను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి ప్రతి సంవత్సరం డిఎస్పీ నిర్వహిస్తానని చెప్పి యువతి యువకులను మోసం చేసి ప్రజా ప్రతినిధులకు నిరుద్యోగ సమస్యలపై మెమోరాండం ఇవ్వడానికి వెళ్లినా సరే విద్యార్థి సంఘ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసిన తుగ్లక్ నిర్ణయాల వల్ల యువత అంత విసిగి వేసారి తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రకటించి పథకాలకు ఆకర్షితులై టిడిపి పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.