-Advertisement-

Paytm payments bank# మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో ఈ సేవలు బంద్... బ్యాంకు అకౌంట్ మార్చుకోండి!

Paytm telugu,Paytm login, Paytm-download, Paytm app,Paytm business,Paytm wikipedia, Paytm Bank, Paytm News,Paytm payment bank issue, Paytm latest news
Peoples Motivation

Paytm payments bank# మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో ఈ సేవలు బంద్...బ్యాంకు అకౌంట్ మార్చుకోండి!

Thumbnails png news Paytm payment bank
ముంబై, (పీపుల్స్ మోటివేషన్):-

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై (Paytm payments bank) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కొన్నిరకాల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ గడువును పొడిగించే ఉద్దేశమేదీ లేదని ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఒకవేళ మీరు ఇప్పటికీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను వినియోగిస్తుంటే.. గడువు ముగియనున్న వేళ త్వరపడాల్సిందే. ఇంతకీ ఏయే సేవలు నిలిచిపోనున్నాయ్? ఏవి కొనసాగుతాయ్?

కొన్ని నిలిచిపోనున్నాయ్? కొన్ని కొనసాగుతాయ్?

  • మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాలో గానీ, వాలెట్లో గానీ నగదును జమ/ లోడ్ చేయలేరు. క్యాష్ బ్యాక్ లు. రిపండ్లు కాకుండా ఇతరుల నుంచి నగదును కూడా అందుకోలేరు.
  • ఒకవేళ ఎవరైనా శాలరీ(జీతం) కోసం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఇచ్చి ఉంటే. మార్చి 15 తర్వాత జమ చేయడం కుదరదు. కాబట్టి మార్చి 15 లోగా మీ శాలరీ అకౌంట్ కీ కొత్త బ్యాంక్ ఖాతా ఇవ్వడం మంచిది.
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో ఒకవేళ ఏదైనా నగదు ఉంటే మార్చి 15 తర్వాత కూడా విత్ డ్రా లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డును కూడా వినియోగించుకోవచ్చు.
  • రిపండ్లు, క్యాష్ బ్యాక్ లు, పార్టనర్ బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్ సేవలు, వడ్డీ మొత్తాలు మార్చి 15 తర్వాత కూడా అనుమతిస్తారు.
  • మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఆటో డెబిట్ కు లింక్ అయ్యి ఉంటే అందులో ఉన్న బ్యాలెన్స్ పూర్తయ్యేవరకు వినియోగించుకోవచ్చు. మార్చి 15 తర్వాత కొత్తగా డిపాజిట్లు మాత్రం అనుమతించరు. కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే.
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంకు జారీ చేసిన ఫాస్టాగ్ లను కూడా బ్యాలెన్స్ ఉన్నంతవరకు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ఫాస్టాగ్ చెల్లుబాటు కాదు. కాబట్టి కొత్త ఫాస్టాగ్ తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఫాస్టాగ్ ను మూసివేయాలని భావిస్తే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను అభ్యర్థించొచ్చు. రిఫండ్ కోరవచ్చు.
  • ఒకవేళ పేటీఎం యూపీఐ ఐడీ (@paytm) వాడుతుంటే ప్రత్యామ్నాయ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోవడం ఉత్తమం.
  • ఓటీటీ సబ్స్క్రిప్షన్ కు ఇదే నియమం వర్తిస్తుంది. బ్యాలెన్స్ ఉన్నంతవరకు మాత్రమే ఆటో డెబిట్ కు అనుమతిస్తారు. మార్చి 15 తర్వాత కొత్తగా లోడ్ చేయడం కుదరదు కాబట్టి ఆటో డెబిట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లో ఒకవేళ నగదు ఉంటే దాన్ని వినియోగించుకోవచ్చు. కావాలనుకుంటే విత్ డ్రా లేదా వేరే బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
  • ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ లేదా ఇతర ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు (DBT) పేటీఎం పేమెంట్స్ ఖాతాను ఇచ్చి ఉంటే వెంటనే మార్చుకోండి. మార్చి 15 తర్వాత రాయితీలు, నగదు బదిలీలు అందుకోవడం వీలు పడదు.

Comments

-Advertisement-