-Advertisement-

Free Aadhaar Update# మరోసారి ఉచిత ఆధార్ కార్డు అప్ డేట్ తేదీ జూన్ 14 వరకు పొడిగింపు...

Free aadhar update date last date, UIDAI Aadhar update, E Aadhar Card download online PDF,uidai.gov.in aadhaar Download Aadhar card with mobile number
Peoples Motivation

మరోసారి ఉచిత ఆధార్ కార్డు అప్ డేట్ తేదీ జూన్ 14 వరకు పొడిగింపు...

Thumbnails free aadhar update
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-

'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు (Adhaar Card) వివరాలను ఉచితంగా అప్ డేట్ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియడంతో ఆధార్ ఉచిత అప్డేట్ కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు UIDAI 'X' లో పోస్ట్ చేసింది. దీంతో 14 జూన్ 2024 వరకు ఉచితంగా ఆధార్ లో మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మొదట 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్ అప్ డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్ట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని UIDAI పేర్కొంది. ఉచిత సేవలు 'My Aadhar' పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.


Comments

-Advertisement-