First Phase#తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వివరాలు..
First Phase#తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వివరాలు..
డిల్లీ, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-
దేశవ్యాప్తంగా 2024 ఎన్నికల సంఘం గ్రామానికి తెరలేచిన విషయం తెలిసిందే (Lok Sabha Elections). ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మొత్తం ఏడు దశల పోలింగ్లో భాగంగా తొలిదశ (First Phase Polls) కు సంబంధించి బుధవారమే నోటిఫికేషన్ విడుదల. దీంతో సంబంధిత పార్లమెంటు నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి మొదలు కానుంది. తొలి విడతలో మొత్తం 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
(First Phase) తొలి దశ వివరాలు..
నోటిఫికేషన్ తేదీ: మార్చి 20
నామినేషన్ల గడువు: మార్చి 27
నామినేషన్ల పరిశీలన: మార్చి 28
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మార్చి 30
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19
రాష్ట్రాల వారీగా తొలి దశలో స్థానాలు..
తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తర్ ప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), అస్సాం (5), మహారాష్ట్ర (5), ఉత్తరాఖండ్ (5), బిహార్ (4), పశ్చిమ బెంగాల్ (3), మణిపుర్ (2), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2), ఛత్తీస్ గఢ్ (1), మిజోరం (1), నాగాలాండ్ (1), సిక్కిం (1), త్రిపుర (1), అండమాన్ నికోబార్ (1), జమ్మూకశ్మీర్ (1), లక్ష్యధ్వీప్ (1), పుదుచ్చేరి (1).