దొంగను తరమికొట్టిన తళ్లికూతురుని సన్మానించిన DCP
దొంగను తరమికొట్టిన తళ్లికూతురుని సన్మానించిన DCP
హైదరాబాద్, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్):-
హైదరాబాద్ బేగంపేటలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలను తల్లీకూతురు తరిమి కొట్టిన ఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరి వీరోచిత పోరాటాన్ని అభినందించేందుకు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని ముందుకొచ్చారు. సదరు మహిళ ఇంటికి చేరుకున్న DCP తల్లీకూతురుని శాలువాతో సత్కరించారు. వీరి ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
నిన్న రోజు ( గురువారం నాడు) బేగంపేటలో తల్లీకూతురు దొంగలతో వీరోచితంగా పోరాడారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకులు నాటు తుపాకీతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. తల్లీకూతురు ధైర్యంగా ఎదిరించారు. ఓ దొంగ చేతిలోని తుపాకీని లాక్కోగా.. అతడు భయంతో పారిపోయాడు. అప్పటివరకు మరో దొంగ ఇంట్లోనే ఉండిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూస్తుండగా అందరి ముందే పారిపోయాడు. ఈ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు.