-Advertisement-

CTET-2024#కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్-జులై) నోటిఫికేషన్ విడుదల

Ctet telugu,CTET login ctet.nic.in 2024,ctet.nic.in result,CTET Answer Key CTET Answer Key CTET ONLINE APPLICATION, CTET LATEST NEWS CTET ELIGIBILITY,
Peoples Motivation

CTET-2024#కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్-జులై) నోటిఫికేషన్ విడుదల

CTET notification news
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ (CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-July 2024) కు నోటిఫికేషన్ విడుదలైంది. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 2024 జులై 7న (ఆదివారం) నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 7 నుంచి ఏప్రిల్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

కొంత ముఖ్యమైన సమాచారం:

సీటెట్ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం 19వ ఎడిషన్ సీటెట్ కు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

దరఖాస్తు రుసుం:

జనరల్/ ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్కు రూ.1000; రెండు పేపర్లకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులైతే ఒక పేపరక్కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్ కు సాధించిన స్కోర్ కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.

ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి..

పేపర్-1ను ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.

పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది. పేపర్ -1 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్, పూర్తి సమాచారంతో కూడిన బుక్లెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Comments

-Advertisement-