సయోధ్య కుదిర్చిన నారా లోకేష్ ప్రభుత్వం వచ్చాక తగిన గౌరవం ఇస్తామని హామీ
సయోధ్య కుదిర్చిన నారా లోకేష్ ప్రభుత్వం వచ్చాక తగిన గౌరవం ఇస్తామని హామీ
నంద్యాల (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చర్చలు - ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చిన నారా లోకేష్. ప్రభుత్వం వచ్చాక తగిన గౌరవం ఇస్తామని బ్రహ్మానందరెడ్డికి లోకేష్ హామీ. ఫరూక్‍తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్న భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో తిప్పర మీసం...రా రమ్మని పిలుస్తోంది తెలుగుదేశం అంటూ...మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్..మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఉరకలేసే ఉత్సాహం తో సోమవారం నంద్యాలలో అడుగు పెట్టనున్నారు.
నంద్యాల టీడీపీ పార్టీలోని ఫరూక్, భూమా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. మరో వైపు మాజీ విత్తనాభి వృద్ధి సంస్థ చైర్మెన్ ఏవి సుబ్బారెడ్డి, సీనియర్ న్యాయవాది తులసి రెడ్డి తో పాటు మాజీ కౌన్సిలర్స్ ఏవిఅర్ ప్రసాద్, శివ శంకర్ యాదవ్ లతో కలిసి భూమా తిరుగుతారో లేదో అన్న సందేఖం కార్యకర్తల్లో నెలకొంది. కేవలం ఫరూక్ తో మాత్రమే భూమా తిరుగుతారా అన్న ప్రశ్నలకు ఇద్దరు నేతలు సమాధానం చెప్పాల్సిందే.నంద్యాలలో తెలుగుదేశం పార్టీ బలం చేకురాలంటే అయింది ఏదో అయింది అనుకొని నేతలందరూ కలిసిపోతే నంద్యాలలో పసుపు జెండా రెపరెపలాడుతుంది అని కార్యకర్తలు అనుకుంటున్నారు.నంద్యాల ప్రజలు డబ్బుకు ఓటువేస్తారో...అభివృద్ధి, అభిమానానికి ఓటు వేస్తారో వేచి చూద్దాం...భూమా...ఫరూక్ కలయికతో నంద్యాలలో అభిమానులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. భూమా కలిసిపోవడం తో ఏనుగును ఎక్కినంత సంతోషంలో అభిమాలు ఉన్నారు. చిలకలూరపేటలో బిజెపి, టిడిపి,జనసేన తో ప్రధాని మోడీ సభ అనంతరం నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో భారీ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.భూమా, ఫరూక్ లు భారీ గా సభను విజయవంతం చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది..