-Advertisement-

డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపే...

Latest Telugu news, daily political updates in Telugu, latest Highcourt judgments, health news daily, latest political updates in AP, Breaking news,
Peoples Motivation

డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపే...

కలకత్తా, మార్చి 03 (పీపుల్స్ మోటివేషన్):-

పరిచయం లేని మహిళను 'డార్లింగ్' అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అలా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని తెలిపింది. ఈ మేరకు పోర్టు బ్లెయిర్లోని హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జై సేన్ గుప్తా తీర్పు వెలువరించారు. గతేడాది అండమాన్ నికోబార్ లోని మాయాబందర్ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ తో నక్ రామ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న అతను.. ఆమెను డార్లింగ్ అని పిలవడంతోపాటు 'చలాన్ ఇవ్వడానికి వచ్చావా' అంటూ దూషించాడు. అతడిపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన నార్త్ - మిడిల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును అడిషనల్ సెషన్స్ కోర్టులో అతడు సవాల్ చేయగా.. దాన్ని తిరస్కరించారు. అనంతరం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జై సేనుప్తా ధర్మాసనం ఫస్ట్ క్లాస్ కోర్టు తీర్పును సమర్థించడంతోపాటు.. డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది.

Thumbnails png pic

Comments

-Advertisement-