-Advertisement-

దోచుకున్న వారిని కఠినంగా శిక్షించి, సొమ్మును రికవరీ చేసి, హాస్పిటల్ ను సీజ్ చేయాలి

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

దోచుకున్న వారిని కఠినంగా శిక్షించి, సొమ్మును రికవరీ చేసి, హాస్పిటల్ ను సీజ్ చేయాలని:-సిపిఎం డిమాండ్

Thumbnails png news3
డోన్, మార్చి 10 (పీపుల్స్ మోటివేషన్):-

డోన్ పట్టణంలోని కంబాలపాడు హైవే ప్రక్కనున్న వైష్ణవి హాస్పిటల్ యాజమాన్యం దొంగ పేషెంట్లను సృష్టించి ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన వైష్ణవి హాస్పిటల్ యాజమాన్యంపై వారికి సహకరించిన ఆరోగ్యశ్రీ సిబ్బంది పై తక్షణమే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని వైష్ణవి హాస్పిటల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీజ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్స్ సిపిఎం డోన్ పట్టణ, మండల కార్యదర్శి కార్యదర్సులు నక్కి శ్రీకాంత్, కోయలకొండ నాగరాజు, పార్టీ మండల కమిటీ సభ్యులు బాస్కర్ రెడ్డి, చిన్న రహిమాన్ లు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వైద్య సేవలు పేద ప్రజల అందరికి అందుబాటులో వుండాలని, సమాన్య ప్రజలకు వరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం వైయస్సార్ ఆరోగ్యశ్రీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణంలోని ప్రయివేట్ హాస్పిటల్ వైష్ణవి మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్మును స్వాహా చేయడం చాలా దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైష్ణవి హాస్పిటల్ యాజమాన్యం ఆరోగ్యశ్రీ సిబ్బంది కుమ్మక్కై ప్రభుత్వ మరియు వైద్య అధికారుల కళ్ళు కప్పి పక్కనున్న అనంతపురం జిల్లా, గుత్తి పట్టణానికి, మరియు మండలానికి చెందిన కొంతమందిని రోజువారి కూలీగా చేసుకొని వారికి రోజుకి 300 నుంచి 500 రూపాయలు ఇస్తూ అంతేకాకుండా రవాణా ఖర్చులు కూడా ముట్టజెప్పి పేషంట్ల వేషాలు వేయించి వారి పేరుపై వైష్ణవి హాస్పిటల్లో యాజమాన్యం ఆరోగ్యశ్రీ సిబ్బంది కలిసి గుత్తి వాసులు పేషెంట్లు గా వారికి ఆపరేషన్ చేసినట్టు హాస్పిటల్ యాజమాన్యం మరియు ఆరోగ్య మిత్రమా బృందం ప్రభుత్వ సొమ్ము కోటి రూపాయలకు పైగా దోపిడి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్మును దోపిడీకి పాల్పడుతున్న వారిని కట్టడి చేయడంలో ఉన్నత జిల్లా వైద్యాధికారులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా అని వారు ప్రశ్నించారు. గుట్టు చప్పుడు కాకుండా విచారణ పేరుతో ఒక వైద్యాధికారి హాస్పిటల్లో అడుగుపెట్టి విచారణ చేస్తున్నామని మభ్య పెట్టేందుకు హాస్పిటల్ కి వచ్చిన ఆ విచారణ వైద్యాధికారి హాస్పిటల్ యాజమాన్యం ముట్ట చెప్పిన లక్షల రూపాయలు జేబులో పెట్టుకుని విచారణను తొక్కి పెట్టింది నిజం కాదా అని వారన్నారు వైష్ణవి హాస్పిటల్ పై విచారణ నిజాయితీగా చేసి ఉంటే ఇప్పటికీ విచారణ చేసి 20 రోజులకు పైగా అవుతున్న ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు.

కోట్లాది రూపాయల దోపిడి జరిగి దాదాపు20రోజులైన హాస్పిటల్ పై అధికారులు స్పందించకపోవడం చూస్తుంటే అధికారులకు వాటాలు ముట్టింటాయని అని వారు తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కడైనా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా పేద ప్రజలకు నిజంగా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కి పోతే పేషెంట్లు యొక్క స్థితిగతులను తెలుసుకొని పేసెంట్ ప్రాబ్లము ఆరోగ్యశ్రీ పథకం కు వర్తించేదైతే ముందుగా రాష్ట్ర వైద్యాధికారి కార్యాలయంకు అమరావతికి పంపడం జరుగుతుందని. అక్కడ ఓకే అని అప్రూవల్ అయిన తర్వాతే ఆపరేషన్ కానీ వైద్య సేవలు కానీ హాస్పిటల్స్ డాక్టర్స్ ప్రారంభిస్తారు. అయితే ఇక్కడి వైష్ణవి హాస్పిటల్ ల్లో అలాంటివి లేకుండా ఆరోగ్యశ్రీ మిత్ర బృందం హాస్పిటల్ యాజమాన్యం చెయ్యి కలిపి ప్రభుత్వ సొమ్మును దోపిడీకి పాల్పడిన ఇప్పటికీ ఆరోగ్యశ్రీ సిబ్బందిని తొలగించడం కానీ హాస్పిటల్ ను సీజ్ చేయడం కానీ, హాస్పిటల్ యాజమాన్యంపై ఆరోగ్య సిబ్బందిపై కేసు నమోదు చేయడం కానీ ప్రభుత్వం నుంచి దోపిడీకి పాల్పడిన డబ్బులను రికవరి చేయడం కానీ ఎలాంటివి కూడా చేయకపోవడం చాలా దుర్మార్గమని వారన్నారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గం లోని ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ సొమ్మును దోపిడీకి పాల్పడుతున్న హాస్పిటల్ పై చర్యలు తీసుకునే విధంగా ఆర్థిక మంత్రిగారు చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఇప్పటికైనా వైద్య శాఖ రాష్ట్ర జిల్లా అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తక్షణమే స్పందించి ప్రభుత్వ సొమ్మును దోపిడీకి పాల్పడిన వైష్ణవి హాస్పిటల్ ను సీజ్ చేసి ఆరోగ్యశ్రీ సిబ్బందిని తక్షణమే తొలగించి ఆరోగ్యశ్రీ సిబ్బంది పై వైష్ణవి హాస్పిటల్ యజమానంపై కఠినమైన కేసు నమోదు చేసి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని లేని పక్షంలో కలిసి వచ్చే ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.

Comments

-Advertisement-