వైసీపీ కీ షాక్ పార్టీ వీడిన మరో మాజీ ఎమ్మెల్యే...
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
5 latest news headlines
latest news world
By
Peoples Motivation
వైసీపీ కీ షాక్ పార్టీ వీడిన మరో మాజీ ఎమ్మెల్యే...
కోడుమూరు, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్. కాంగ్రెస్ లో చేరిన మరో మాజీ ఎమ్మెల్యే. ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ హస్తం కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే & మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు పరిగెల మురళీకృష్ణ వారి అనుచరులు బుధవారం ఉదయం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఏపీ.పీసీసీ ప్రెసిడెంట్ వైయస్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మురళీకృష్ణ 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసీపీలో చేరారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 2019లో వైసిపి సీటు ఆశించినప్పటికీ అప్పటి సమీకరణాల కారణంగా సీటు దక్కలేదు. ప్రస్తుతం 2024 ఎన్నికలలో అయినా సీటు వస్తుందని ఆశించినప్పటికీ జగనన్న మొండి చేయి చూపడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. మురళి కృష్ణ కి మంచి అనుచరుగణం, సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడని, సహాయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చే నాయకుడని, ఇవన్నీ అతనికి కలిసొచ్చే అంశాలని కార్యకర్తలు పేర్కొంటున్నారు.
Comments