-Advertisement-

విద్యార్థులకు ఆటోమేటిక్‌గా ఓటరు ఐడీ కార్డులు

General elections 2024, Loksabha elections 2024, General Elections News, General Elections Dates, Students automatic election card,elections in Telugu
Peoples Motivation

విద్యార్థులకు ఆటోమేటిక్‌గా ఓటరు ఐడీ కార్డులు

ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం

18 ఏళ్లు నిండిన 12వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు 

-చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

Student automatic election id card

డిల్లీ, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):-

18 ఏళ్లు నిండిన విద్యార్థులకు ఆటోమేటిక్ గా ఓటర్ ఐడీ కార్డులు అందించేలా భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అర్హత కలిగిన 12వ తరగతి (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) విద్యార్థులు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్ ఐడీ కార్డులు జారీ చేయనున్నామని, 18 ఏళ్లు నిండిన వెంటనే ఆటోమేటిక్‌గా ఓటరు కార్డులను అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తెలిపారు. ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని, 18 ఏళ్లు నిండడానికి ముందే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయబోతున్న యువ ఓటర్లు 1.8 కోట్ల మంది ఉన్నారని రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Comments

-Advertisement-