ఎసిబి అధికారుల దాడి..ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహసీల్దార్ అరెస్ట్
ఎసిబి అధికారుల దాడి..ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహసీల్దార్ అరెస్ట్
కరీంనగర్, మార్చి 13 (పీపుల్స్ మోటివేషన్):-
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజనీని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మొత్తం రూ.3.2 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.12 కోట్ల వరకూ ఉంటుందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు హనుమకొండ కేఎల్ నగర్ కాలనీలోని ఆమె నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఓకే సమయంలో 5 చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. రెండంతస్తుల భవనం, రెండు చోట్ల ఇళ్ల స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు కార్లు, 3 ద్విచక్రవాహనాలు, బ్యాంకులో రూ.25 లక్షల నగదు నిల్వ, 1.4 కిలోల బంగారు ఆభరణాలు, రూ. లక్షన్నర నగదు గుర్తించామన్నారు. గురువారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో తహసీల్దారును హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.