డోన్ టీడీపీ అభ్యర్థిత్వంలో మార్పులు జరిగేనా...?
డోన్ టీడీపీ అభ్యర్థిత్వంలో మార్పులు జరిగేనా...?
కోట్ల సుజాతమ్మ చూపు ఆలూరు వైపా...?
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపి వైపు మొగ్గు చూపుతున్నాడా...?
డోన్, మార్చి 16 ( పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు ఉమ్మడి జిల్లాలో టీడీపీ, వైసీపీ పార్టీలలో రాజకీయ వేడి రగులుతూనే ఉందనడంలో ఎటువంటి సందేహంలేదు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్తీగా డోన్ నుండి పోటీకి సిద్ధమైన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గతంలో కర్నూలు ఎంపీ గా గెలిచి కేంద్రంలో రైల్వే ఉపమంత్రిగా చేయటంతో కర్నూలు నుండి ఎంపి గా పోటీ చేస్తేనే బాగుంటుందని తమ అనుయాయులు చర్చించుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్ లొనే ఉన్న ఆలూరులో కోట్ల సుజాతమ్మకు ప్రజాదరణ పెరగటంతో గెలుపు సులభమని,గత పది సంవత్సరాలుగా ప్రజల మథ్యనే ఉంటు, వారితో మమేకమై టీడీపీ ని మరింత బలోపేతం చేసిన వాళ్లలో సుజాతమ్మ ఒకరు. ఒకవేళ ఆలూరు లో సుజాతమ్మ బరిలోకి దిగితే గెలుపు ఖాయమని సమాచారం. ఒకవేళ కోట్ల కర్నూలు ఎంపి గా పోటీచేస్తే కర్నూల్ పార్లమెంట్ లో ఉన్నా ఏడింటిలో ఆరు నియోజకవర్గాల ప్రజల మద్ధతు కోట్లకే ఉంటుందని ప్రకాష్ రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు.