-Advertisement-

వైసీపీకి మంత్రి రాజీనామా... టీడీపీ గుంతకల్ నుంచి పోటీ

Latest political updates in Telugu, AP Latest Political Updates, Tdp Latest updates, bjp party latest updates,national updated news,Daily Current news
Peoples Motivation

వైసీపీకి మంత్రి రాజీనామా... టీడీపీ గుంతకల్ నుంచి పోటీ

జగన్ ను దేవుడిలా చూశాం...

కర్ణాటకలో నా సోదరుడు మంత్రి...

గుంతకల్ నుంచి పోటీ...

ఆ రెండు జిల్లాలలో మా కులం ఎక్కువగా ఉంది...

కర్నూలు జిల్లాలో బీసీలకు న్యాయం జరగలేదు  

-గుమ్మనూరు జయరాం 

Thumbnails png alur
విజయవాడ, మార్చి 05 (పీపుల్స్ మోటివేషన్):-

ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానని.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను.. మంత్రి పదవి చేశాను.. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానని ఆయన తెలియజేశారు. చంద్రబాబు సమక్షంలో మంగళగిరిలో జరిగే జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానన్నారు. ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని అనుకున్నా.. ఎంపీ పదవి వద్దన్నానని ఆయన తెలిపారు. మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మా కులం ఎక్కువగా కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఉన్నారని.. గుంతకల్ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉంది. కాబట్టి తాను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని తెలిపారు. వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారని.. తనకు ఇష్టం లేదన్నారు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు.

గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ..కర్ణాటకలో నా సోదరుడు మంత్రిగా ఉన్నారంతే.. నేనేమీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో లేను. సీఎం జగన్ నా.. నా.. అంటున్నారు.. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీలకు న్యాయం జరగలేదు. ఓ బోయను.. ఓ ఎస్సీ.. ఓ ముస్లింలను తీసేశారు. 2022 తర్వాత జగన్ ను ఓ దేవుడిగానే చూశానని. కానీ 2022 తర్వాత జగన్ విగ్రహంగా మారారని. ఆ విగ్రహానికి సజ్జల, ధనుంజయ్ రెడ్డిలు పూజారులు. పూజారులు వాళ్ల కొడుకులకే న్యాయం చేస్తున్నారు కానీ.. భక్తులకు న్యాయం చేయడం లేదు.” అని గుమ్మనూరు జయరాం అన్నారు.

Comments

-Advertisement-