షాహీద్ దివస్# భరతమాత కోసం విప్లవవీరులు ఉరికొయ్యను ముద్దాడిన రోజు
షాహీద్ దివస్# భరతమాత కోసం విప్లవవీరులు ఉరికొయ్యను ముద్దాడిన రోజు
దేశాన్ని బ్రిటిషర్ల కబంధహస్తాల నుంచి విముక్తి కలిగించి, స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు. తమ ధన మాన ప్రాణాలను సైతం అర్పించారు. వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్. ఆయన పేరు వింటే చాలు.. యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది. భరతమాత కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు.
భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చిన్నతనం నుంచి స్వాతంత్ర కాంక్షతో రగిలిపోయి బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి భరతమాత కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు. 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్‌తోపాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో ఉరి తీశారు. ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా.. వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా.. చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు.
భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేసిన రోజును షహీదీ దివాస్‌గా జరుపుకొంటూ.. ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. దేశ స్వాతంత్య్రోద్యమంపై చెరగని ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరొందిన భగత్ సింగ్ పంజాబ్‌లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో ఉంది. అతడి తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్.. స్వామి దయానంద సరస్వతి అనుచరుడు. ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. తాత ప్రభావం భగత్ సింగ్‌పై ఎక్కువ. గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టాడు.

అనంతరం 1929లో ఈ ముగ్గురూ పార్లమెంటుపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. సాండర్స్‌ను హత్య చేసినందుకు గానూ బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురిపై హత్యానేరం మోపింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ కూడా నేరాన్ని ఒప్పుకున్నారు. ఏ మాత్రం బెదరక కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. అనంతరం వారి శవాలను సగం కాల్చి సట్లెజ్ నదిలో విసిరేశారు. అక్కడే ఓ స్మారకాన్ని నిర్మించారు.
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులను ఉరి తీసిన హుస్సైనీవాలాతోపాటుగా భగత్ సింగ్ జన్మించిన ఖాత్కర్ కలాన్‌లో ఏటా మార్చి 23న షాహిదీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. లాహోర్‌లోనూ ఘనంగా భగత్ సింగ్‌కు నివాళులు అర్పిస్తారు. పాకిస్థాన్‌తోపాటు ఇటు భారత్‌లోనూ ప్రతి ఒక్కరూ షాహిదీ దివస్ సందర్భంగా భగత్ సింగ్ సేవలను స్మరించుకుంటున్నారు.
BHAGATH SINGH SLOGANS
👉దేశం కోసం చనిపోయేవారు..ఎల్లకాలం బతికే ఉంటారు.
👉తిరుగుబాటు అనేది ఒక విప్లవం కాదు. అది చివరికి ముగింపునకు దారి తీయవచ్చు.
👉ప్రేమ ఎల్లప్పుడూ మనిషి పాత్రను ఉద్దరిస్తుంది. ఇది అతన్ని ఎప్పటికీ తగ్గించదు. ప్రేమ ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది.
👉వారు నన్ను చంపవచ్చు. కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు. నా ఆత్మను దహించలేరు.
👉చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి.
👉ప్రేమికులు, వెర్రివాళ్లు, కవులు ఒకే ముడిసరుకుతో తయారవుతారు.
👉మనుషులను చంపగలరేమో.. కానీ వారి ఆదర్శాలను చంపలేరు.
- భగత్ సింగ్
విషయ నిపుణులు..✍️
MURAHARI PRASAD
LECTURER-IN- ENGLISH