-Advertisement-

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వివాదాలపై విచారణ జరపాలి..

Breaking news in telugu, latest news in Telugu, telugu short news, telugu updated news, daily political updates, latest current news, national news,
Peoples Motivation

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వివాదాలపై విచారణ జరపాలి..

బనగానపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బి.మాధవ స్వామీ, రాజునాయుక్, యాగంటప్పలపై విచారణ జరపాలి

మేం ఆడిందే ఆట.! పాడిందే పాట అంటూ ఆ ఇద్దరి ఉపాధ్యాయుల వైఖరి

ఆ ఇద్దరు ఉపాధ్యాయులూ ఓ ఉపాధ్యాయ యూనియన్లో లీడర్లు

ఆ స్కూల్ అసిస్టెంట్ మాధవ స్వామి పై అనేక ఆరోపణలు, ఒకానొక సందర్భంగా విద్యార్థినీల తల్లిదండ్రులు దాడికి సిద్దపడిన సంఘటనలెన్నో

వరుస ఘటనలు - వరుస వివాదాలు - విద్యార్ధినిలనుండి అనేక ఆరోపణలు

పధకం ప్రకారంలో భాగమే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి బలి

బనగానపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)ను ప్రక్షాళన చేయాలి

విద్యార్ధుల భవిష్యత్తును కాపాడుకుందాం.

వివాదాలకు, ప్రధాన ఆరోపనలకు కారణమైన స్కూల్ అసిస్టెంట్లు మాధవ స్వామీ, రాజునాయక్ లపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి

మాధవ స్వామి ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ జరపాలి

లెక్కకు మించి ఆస్తులెక్కడివీ.?

ఈ ఘటనపై నేడు నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం స్పందనలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులుకి , డీఈఓ సుధాకర్ రెడ్డికి విద్యార్ధి, యువజన సంఘాల జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు.

నంద్యాల కలెక్టరేట్, మార్చి 04 (పీపుల్స్ మోటివేషన్):-

బనగానపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (బాలురు) జరుగుతున్న వివాదాలపై , పాఠశాల ఉపాధ్యాయులు మాధవ స్వామీ , రాజునాయక్ , యాగంటప్పలపై విద్యార్ధుల నుండి వచ్చిన ఆరోపనలు , వాస్తవ వాస్తవాలపై విచారణ జరిపి బనగానపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) విద్యార్ధుల భవిష్యత్తును కాపాడుకుందాం అంటూ సోమవారం రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులుకి , డీఈఓ సుధాకర్ రెడ్డి కి నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డెమొక్రటిక్ విద్యార్ధి , యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ , నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ (ఎన్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు నాగసారి సుంకన్న , ఆలిండియా యూత్ లీగ్ (ఏఐవైఎల్) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు. మాట్లాడుతూ నంద్యాల జిల్లా బనగానపల్లె,కొండపేట బాయ్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వివాదాలకు నిలయంగా మారిందని టీచర్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో విద్యార్థులు సతమతమవుతున్నరని,అదే స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ లుగా విధులు నిర్వహిస్తున్న బి.మాధవ స్వామి,రాజు నాయక్,యాగంటప్ప మీద అనేక ఆరోపణలు వచ్చిన కూడా అక్కడ నుంచి బదిలీలు కాకుండా గత 7 సంవత్సరలుగా అదే స్కూల్ నందు అవే సీట్లకు ఫెవికిక్ వేసుకొని కుర్చీలకు అతుక్కుపోయి విధులు నిర్వహిస్తున్నారని,మాధవ స్వామి అనే వ్యక్తి స్కూల్ సంబంధించిన నాడు నేడు కార్యక్రమం మీద వచ్చే నిధులు మొత్తం స్వాహా చేయడానికి అతనికి అనుకూలం ఉండే వ్యక్తులకు మాత్రమే కాంట్రాక్టులు ఇవ్వాలని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలి మీద వత్తిడి తీసుకోరావడం జరుగిందని, గత 7 సంవత్సరల కిందట ఎటువంటి ఆస్తులు లేని మాధవ స్వామి కేవలం 7 సంవత్సరలలోనే లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు స్కూల్ లో జరిగే అభివృద్ధి పనులలో తనకు కమిషన్ ఇచ్చే వారికి మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చి లక్షల రూపాయల డబ్బులు సంపాదించారని , మాధవ స్వామి, రాజునాయక్ స్కూల్ కి హాజరై హాజరు వేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో ఎటువంటి సమయం మరియు సంతకాలు పెట్టకుండా వారికి ఇష్టం వచ్చినప్పుడు బయటకు పోయి స్కూల్ సమయం ముగిస్తున్న సమయంలో స్కూల్ కి హాజరవుతున్నారని,స్కూల్ HM ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే మేము ఉపాధ్యాయ సంఘాల నాయకులము అంటూ మాకు ఇష్టం వచ్చినపుడు వస్తాం నువ్వు ఎవ్వరు మమ్మలి అడగడానికి అంటూ నియంతృత్వ ధోరణితో మాట్లాడుతూన్నారని,గత సంవత్సరం అనగా 2023 లో నవంబర్ నెలలో విశాఖ ఉక్కు కు మద్దతుగా విద్యార్థి సంఘాలు నిర్వహించిన బంద్ కార్యక్రమంలో స్కూల్ ఆవరణంలో విద్యార్థులందరిని పోగు చేసుకొని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలి మీద అసత్య ప్రచారం చేస్తూ HM డౌన్ డౌన్ అంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించిన మాధవ స్వామి పై జిల్లా విద్యా శాఖ అధికారులు అతడిని సస్పెండ్ చేయగా తిరిగి ఒక నెల తర్వాత అదే స్కూల్ నందు పోస్టింగ్ తీసుకోవడం జరిగిందని,ఒక ఉపాధ్యాడిని సస్పెండ్ చేసిన తర్వాత తిరిగి అదే స్థానంలో అక్కడే పోస్టింగ్ ఇవ్వడం విడ్డురంగా ఉందని,మాధవ స్వామి ఆస్తులపై ACB అధికారులతో విచారణ జరపాలని,స్కూల్ అసిస్టెంట్ రాజు నాయక్ ఐతే ఆయన గత రెండు సంవత్సరాలుగా ఆయన సర్వీస్ రిజిస్టర్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అధికారికంగా విధులు నిర్వహిస్తున్నాడని,మాధవ స్వామి మరియు రాజు నాయక్ సెలవులు అధికంగా తీసుకోవడంతో ఈ విషయం బయట పడుతుందని అనే నెపంతో 2022 సంవత్సరంలో అటెండెన్స్ రిజిస్టర్ ను కూడా చించివేయడం జరిగిందని.రాజు నాయక్ అనే స్కూల్ అసిస్టెంట్ ప్రతి నిత్యం మద్యం సేవించి స్కూల్ నందు విధులు నిర్వహిస్తూ విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించే వాడని,స్కూల్ అసిస్టెంట్ యాగంటప్ప గతంలో ఒక విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారి తల్లిదండ్రులు కూడా అతనిపై దాడి చేయడానికి వస్తే రాజకీయ అండదండలతో మరియు డబ్బు అహంకారంతో ఆ సమస్యను కూడా బయటకు పొక్కకుండా మ్యానేజ్ చేసుకున్నాడని వారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఉన్నత మనసుతో విద్యా వ్యవస్థను నాడు-నేడు మరియు ఇంగ్లీష్ విద్యా ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పట్టిస్టం చేస్తుంటే బనగానపల్లె కొండపేట లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ లుగా విధులు నిర్వహిస్తున్న మాధవస్వామి, రాజు నాయక్, యాగంటప్ప లు విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించే విధంగా తయారయారని, వెంటనే వీరిని సస్పెండ్ చేసి సస్పెండ్ పూర్తయిన తర్వాత వేరే దూర ప్రాంతాలలో ఉన్న స్కూల్ కి ట్రాన్సఫర్ చేయాలని వారు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు కి మరియు జిల్లా విద్య శాఖ అధికారి సుధాకర్ రెడ్డి కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నాయక్,సుబ్బు, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

Thumbnails png55

Comments

-Advertisement-