ఎట్టకేలకు డీఎస్సీ పరీక్షల తేదీల మార్పు... నూతన షెడ్యూల్ వెల్లడించిన పాఠశాల విద్యా కమిషనర్
ఎట్టకేలకు డీఎస్సీ పరీక్షల తేదీల మార్పు... నూతన షెడ్యూల్ వెల్లడించిన పాఠశాల విద్యా కమిషనర్
మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు
హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్డ్ మార్పు
పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్
అమరావతి, మార్చి 10 (పీపుల్స్ మోటివేషన్):-
ఉపాధ్యాయ నియామక కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ-2024 పరీక్షల తేదీలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు డీఎస్సీకి మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షెడ్యూలు మార్చారు.
మార్చిన నూతన షెడ్యూల్డ్ వివరాలు....
మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ SGT
మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 7న..
ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు.
ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ SA
ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. మొదట ప్రక టించిన షెడ్యూల్ ప్రకారమైతే ఈనెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది తెలిసిందే.