గ్రామాల్లో విరివిగా మధ్యం అమ్మకాలు అధికారుల పనితీరు ఇక అంతేనా... ఎన్నికల కోడ్ అమల్లో ఉందా... లేదా...?
గ్రామాల్లో విరివిగా మధ్యం అమ్మకాలు
అధికారుల పనితీరు ఇక అంతేనా...
ఎన్నికల కోడ్ అమల్లో ఉందా... లేదా...?
వైన్స్ షాపులకు లిమిట్...బెల్ట్ షాపులకు నో లిమిట్..
గ్రామాల్లో విరివిగా మధ్యం అమ్మకాలు..
మెరుపు దాడులు...
పలు మండలాల్లో పై పై దాడులు..
చెన్నారావుపేట, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్):-
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మధ్యం పై ప్రత్యేక దృష్టి సాధించారు. సగం జీవితాలు మధ్యం తోనే మయం అవుతున్నాయి ఆని మధ్యం ని అరికట్టాలి ఆని ప్రభుత్వం ప్రణాళిక రచయిస్తుంటే సదరు శాఖ ప్రోత్సహం తోనే ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది అని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
నర్సంపేట నియోజకవర్గ పరిధిలో గల చెన్నారావుపేట మండలంలో ఎన్నికల కోడ్ అమలులో వుందా.. లేదా అన్నట్టుగా వుంది ఆని పలువురు గ్రామస్థులు భాహిరంగంగా ఆరోపిస్తున్నారు.ఎన్నికల కోడ్ అమలులో వున్న గ్రామాల్లో విచ్చలవిడిగా మధ్యం అమ్మకాలు గ్రామాల్లో భహిరంగంగా విక్రయాలు జరుగుతున్న చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.
వైన్స్ షాపులకు లిమిట్.....
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతటా రాత్రి 8 గంటల వరకు వైన్స్ షాపులు మూసి వేయాలి ఆని కీలక అదేశాలు జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈల సమయం నిర్ణయించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కి ప్రత్యకంగా మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు.
బెల్ట్ షాపు లకు నో లిమిట్.....
వైన్స్ షాపులకు 8 గంటల వరకు అనే నిబంధత సరే మరి బెల్ట్ షాపు ల సంగతీ ఏంటీ మరీ... అంటూ ప్రజలూ ఏన్ని సార్లు విమర్శించిన సంబంధిత శాఖ మాకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం వెనుక వున్న ఆంతర్యం ఏంటో మరీ. గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా జోరుగా మద్యం అమ్మకాలు ప్రతీ నిత్యం ప్రతి రోజూ జరుగుతున్న సంబంధిత అధికారులు మౌనం వెనుక వున్న మర్మం ఏంటో మరీ ఆని గ్రామస్థులు ముక్కన వ్రేలు వేసుకుంటున్నారు. బెల్ట్ షాపులకు 8 గంటల సమయం కే మూసివేయడం కావునా గ్రామాల్లో మధ్య రాత్రి 12గంటల వరకూ ఈ యెక్క మధ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఆని ఆరోపణలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి.
గ్రామాల్లో విరివిగా మధ్యం అమ్మకాలు.....
ఎన్నికల కోడ్ అమలులో వున్న గ్రామాల్లో మధ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ పక్కత్రోవ పట్టిందా.. పట్టించుకుంట లేరా.. గ్రామాల్లో బెల్ట్ షాపు లను నిర్మూలించాలి ఆని సంబంధిత శాఖను గ్రామస్థులు వేడుకుంటునన్నారు.
మెరుపు దాడులు....
దాగుడు మూతలు లా దాడులు జరపడం వల్ల పుట్ట గొడుగుల్ల పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు అప్పుడప్పుడు ఆయా ఆయా గ్రామాల్లో ఏదో ఒక షాప్ లో మెరుపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్న సంబంధిత శాఖ ఆని ఆరోపణలు వస్తున్నాయి.