-Advertisement-

చంద్రబాబు మీద నమ్మకం ఉందీ... బీ ఫామ్ నాకే వస్తుంది..

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

చంద్రబాబు మీద నమ్మకం ఉందీ... బీ ఫామ్ నాకే వస్తుంది..

చంద్రబాబు నాయుడు పరిశీలన చేసి న్యాయం చేస్తారు..

-ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

డోన్, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-

ఈ రోజు ప్యాపిలి పట్టణంలో ప్యాపిలి మండలం టిడిపి నాయకులతో కలిసి నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో డోన్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ...

Tdp incharge tdp
రెండున్నర సంవత్సరాల కిందట తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నన్ను ఇంచార్జ్ గా ప్రకటించిన తరువాత జలదుర్గం, ప్యాపిలి లో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంతకు ముందు డోన్ నియోజకవర్గంలో ఎవరైతే పని చేశారో కె.యి, కోట్ల కుటుంబాలను వారి ఇళ్ళకు వెళ్ళి డోన్ నియోజకవర్గంకు రమ్మని అడగటం జరిగిందని, వాళ్ళు మేము రమని చెప్పిన తరువాతనే కె.యి.ప్రతాప్ అన్న చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకెళ్ళి మాట్లాడిన తరువాత నన్ను ఇంచార్జ్ గా ప్రకటించడం జరిగింది. నేను రెండున్నర సంవత్సరాలు పని చేసిన తరువాత కెయి, కోట్ల కుటుంబాలు మేమే ఉండాలనే ఉద్దేశ్యంతో ఆరెండు కుటుంబాలు ఏకమై నాకు టికెట్ రాకుండా చేశారని అన్నారు. అయినప్పటికీ ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు పైన పూర్తి నమ్మకం ఉందని, మరలా డోన్ నియోజకవర్గం పై చంద్రబాబు నాయుడు పునఃపరిశీలన చేసి డోన్ నియోజకవర్గ బీ ఫామ్ నాకే ఇస్తారని నమ్మకం ఉందని అన్నారు. అదేవిధంగా తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు, మీ నిర్ణయం మేరకు ముందుకు పోతానని అన్నారు.
Tdp incharge tdp

ఈ సమావేశంలో ప్యాపిలి పట్టణ టిడిపి అధ్యక్షులు భూశెట్టి చిన్న సుంకయ్య, ఎర్రగుంట్లపల్లె వేంకటేశ్వర రెడ్డి, ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి మెట్టుపల్లె సుదర్శన్, అంకిరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దానం మధుసూదన్ మరియు ప్యాపిలి మండలం నాయకులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-