కెనాల్ లో నీట మునిగి యువకుల దుర్మరణం.. పండగ పూట తీవ్రవిషాదం.
కెనాల్ లో నీట మునిగి యువకుల దుర్మరణం.. పండగ పూట తీవ్రవిషాదం
ముప్కాల్/నిజామాబాద్, మార్చి 08 (పీపుల్స్ మోటివేషన్):-
నిజామాబాద్ జిల్లా, ముప్కాల్‌లో శివరాత్రి పండగ పర్వదినాన తీవ్ర విషాధం చోటుచేసుకుంది. మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువలో హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో ముగ్గురు యువకులు మహాశివరాత్రి పుణ్య స్నానానికి వెళ్లి మృతి చెందారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జక్రాన్‌పల్లి మండలం, గన్య తండాకు చెందిన అజ్మీరా సాయినాథ్, బానావత్ లోకేష్, అజ్మీరా సాయికిరణ్, శభావత్ వంశీ, అజ్మీరా సందీప్, భుఖ్యా భాస్కర్ కారులో ఆరుగురు యువకులు వచ్చి ముగ్గురు యువకులు స్నానం ఆచరించి పక్కన ఉండగా అజ్మీరా సాయినాథ్, బానావత్ లోకేష్, అజ్మీరా సాయికిరణ్ ముగ్గురు మరొకసారి స్నానం చేస్తామని కాలువ ముందు ప్రాజెక్టులో దూకారు. లోతు ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లి మునిగిపోయారు. ఇది గమనించిన వంశీ తాండవాసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్న మరో యువకుడు పోలీసులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్మూర్ ఎసిపి బస్వారెడ్డి బృందం గాలించగా మృతదేహాలు లభించాయి. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానాకు తరలిం చారు. వీరిలో లోకేష్ బీటెక్ సాయినాథ్, సాయి కిరణ్ ఇంటర్ చదువుతున్నారు. పండుగ పూట ముగ్గురు యువకులు చనిపోవడంతో తండాలో విషాదం నెలకొంది.