-Advertisement-

ప్రభుత్వ ఆస్తి..ప్రజల ఆస్తి గా కాపాడండి...

Telugu political updates, latest political news updates in Telugu, ycp latest updates, tdp latest updates, Andhra political updates, political updates
Peoples Motivation

ప్రభుత్వ ఆస్తి..ప్రజల ఆస్తి గా కాపాడండి...

బాధ్యులపై పోలీస్ కేసు నమోదులో ఆలస్యం ఎందుకో...

సోషల్ మీడియా, పత్రికల్లో వచ్చేవరకు అధికారులకు తెలియకపోవడం దారుణం...

మున్సిపల్ ఆస్తి నీ కాపాడటానికి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తా...

ఆస్తిని కాపాడటానికి ధర్నాలకు సిద్దం...

-బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు

Thumbnails png bjp
నంద్యాల, మార్చి 03 (పీపుల్స్ మోటివేషన్):-

నంద్యాల పట్టణం ఎస్బిఐ కాలనీ సమీపంలో మున్సిపల్ భూమి ప్రభుత్వ ఆస్తిగా,ప్రజల ఆస్తిగా కాపాడాలని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు డిమాండ్ చేశారు.నంద్యాలలో సంచలనంగా మారిన ఎస్బిఐ కాలనీ సమీపంలోని మున్సిపల్ స్థలం వద్దకు వెళ్ళి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన 50 కోట్లు విలువచేసే భూమిని కొందరు దొంగ పట్టాల ద్వారా అన్యాక్రాంతం, అక్రమంగా అనుభవించాలని చూస్తున్నారని సోషల్ మీడియా,పత్రికల్లో బహిర్గతం చేసే వరకు అధికారులకు తెలియకపోవడం దారుణమని అన్నారు. జనవరిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన స్థలం అన్యాక్రాంతం పై నిజా,నిజాలు శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. మున్సిపాలిటీకి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా సమాచారం ఇవ్వాలని ప్రశ్నించిన విషయం తెలిసిందే అన్నారు. ఈ విషయం పై గత నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ లో స్థల వివాదంపై చైర్మెన్ మాబున్నిసా మాట్లాడుతూ పూర్తిగా నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి కోర్టు ను ఆశ్రయించడంతో పాటు బాధ్యులపై పోలీస్ కేసు నమోదు చేస్తామని ఆస్తులు కాపాడుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కౌన్సిల్ లో చైర్మెన్, కమిషనర్ ఇచ్చిన హామీ 48 గంటలు గడిచినా పోలీస్ స్టేషన్ లో నేటి వరకు భాదితులపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం లేదని నా దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ విషయంపై కమిషనర్ కు ఫోన్ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. బాధితులతో అధికారులు, నేతలు కుమ్మక్కు అయ్యారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. బిజెపి పార్టీ ఆదేశాల మేరకు మున్సిపల్ ఆస్థిని కాపాడుకునేందుకు ఉన్నత స్థాయి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి దర్నాలకైన సిద్దం అన్నారు. మున్సిపల్ ఆస్థి అన్యాక్రాంతం అయితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమన్నారు. మున్సిపల్ ఆస్థిని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. మున్సిపల్ స్థలం పూర్తి వివరాలు 2313/1 సి పూర్తి విస్తీర్ణం 9.42 ఎకరాలు వుందన్నారు. వివాదం స్థలం 3.41 ఎకరాలు ఇరువురి మధ్య 1960 లో కోర్టు లో వివాదం నడుస్తుందని అన్నారు. అప్పటి భూసేకరణ అధికారులు 3.41 ఎకరాలు సేకరణ పరిహారం అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేశారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆ స్థలం మున్సిపాలిటీ ఆధీనంలో వుందని అన్నారు. 2022 వ సంవత్సరం మార్చి 14 వా తేదీన జిపి ఏ రఫివుల్లా ఖాన్ (రాయలసీమ చాంద్) వైసిపి నాయకుడు పేరు మీద పెండింగ్ రిజిష్టర్ అయిందని పేర్కొన్నారు. అదే ఏడాది కోర్టు ఉత్తర్వులతో జూన్ 30 వా తేదీన పెండింగ్ రిజిష్టర్ కు నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారని అన్నారు. నంద్యాల తహశీల్దార్ కార్యాలయంలో పాస్ బుక్కులకు దరకాస్తులు చేసుకోవడంతో ప్రభుత్వ భూమి కావడంతో అప్పటి తహశీల్దార్ రిజెక్ట్ చేశారన్నారు. తహశీల్దార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని రెండు కేసులు వేసినా కోర్టు రెండు కేసులు కొట్టి వేశారని పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి నంద్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ భూమి సమస్య జరుగుతున్నా మున్సిపల్ అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందని అభిరుచి మదు ఆరోపించారు. గత ఏడాది 2023 వ సంవత్సరం డిసెంబర్ 20 తేదీన జిల్లా లోని బెతంచెర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జీపిఏ పొందిన రఫివుల్లా ఖాన్ నుంచి 8 మంది పేర్లతో మొత్తం 44 డాక్యుమెంట్స్ రిజిష్టర్ అయ్యాయని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టి కుట్టనట్లుగా లేకపోవడంతో సోషల్ మీడియా ప్రతినిధి జరుగుతున్న దోపిడీని ముందస్తుగా హెచ్చరిస్తూ పూర్తి ఆధారాలు అడంగల్ తో సహా ఆధారాలు నిరూపించడం అధికారులు, నేతలు ఖంగు తిన్నారు అన్నారు. తప్పు ఎక్కడ జరిగింది, ఏ స్థాయిలో జరిగితే అధికార యంత్రాంగం ఏమి చేయాలో తెలియదా అని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ లపై మున్సిపల్ కమిషనర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా 50 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయక పోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి అన్నారు. 50 కోట్ల విలువైన మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు తెరవెనుక ఉండి నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని అభిరుచి మదు ఆరోపించారు. వెనకుండి నడిపించే వ్యక్తులు ఎవరా అన్నది బయటికి రావాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ ఆస్తులు కాపాడుకోవడానికి ఎంతవరకైనా సిద్ధమని, బిజెపి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మున్సిపల్ కార్యాలయం ముట్టడికి సిద్ధమని అన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి మున్సిపల్ ఆస్తి, మన ఆస్తి నీ కాపాడెంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని అన్ని శాఖల్లో అవినీతికి నిలయంగా మారిందని సోషల్ మీడియా, పత్రికల్లో వచ్చేవరకు అధికారులకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. సోషల్ మీడియా సేకరించిన అడంగల్ ఆధారాలు కూడా ప్రజలు చూసి అర్థం చేసుకోండి. కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికార పార్టీ నాయకులు నోరు మెదపకుండా ఉండడం విశేషం అన్నారు. మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోకపోవడం ఇది కూడా అభివృద్ధి కదా అని అభిరుచి మదు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కసెట్టి చంద్ర శేఖర్, ఉపేంద్ర రెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Thumbnails png bjp

Comments

-Advertisement-