-Advertisement-

నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ...

ts tet syllabus ts tet 2024 exam date tstet.cgg.gov.in results ts tet results ts tet latest news today ts tet 2024 syllabus tstet.cgg.gov.in hall tick
Peoples Motivation

నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ...

మార్చి 14న తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఈరోజు నుంచే ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఏప్రిల్ 10

మే 20 నుంచి జూన్ 3వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష‌లు

హైదరాబాదు (పీపుల్స్ మోటివేషన్):-

TS TET ONLINE APPLICATION
మార్చి 14న‌ తెలంగాణ( ఉపాధ్యాయ అర్హత పరీక్ష ) టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌యిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్‌సీకి ముందే టెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో ఈరోజు (మార్చి 27వ) నుంచే ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ మొదలయ్యింది. ఏప్రిల్ 10వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని ఇప్పటికే విద్యాశాఖ వెల్ల‌డించింది. అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామన్నారు. కాగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు HMలుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే..

ఇత‌ర పూర్తి స‌మాచారం కోర‌కు ఇక్కడ క్లిక్ చేయండి 

Comments

-Advertisement-