డోన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆశీర్వదించండి - కోట్ల
డోన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆశీర్వదించండి - కోట్ల
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన టిడిపి, జనసేన కార్యకర్తలు
డోన్ పట్టణంలో బాణ సంచాతో భారీ ర్యాలీ
డోన్, మార్చ్ 01 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే!! శుక్రవారం శుభసూచికంగా ఉద్దేశించి పట్టణంలోని అమ్మ హోటల్ సర్కిల్ నుండి పాత బస్టాండ్ మధు ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగసభలో టిడిపి నాయకులు కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, కేఈ ప్రభాకర్, లు మాట్లాడుతూ సభలో పాల్గొన్న డోన్ నియోజకవర్గం మరియు జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లకు, జనసేన సైనికులు గతంలో ఎన్నో ఏళ్లుగా కె.ఈ, కోట్ల, కుటుంబాలు డోన్ నియోజకవర్గం లో ఎంతో అభివృద్ధిగా తీర్చిదిద్దారని, ఈ ఐదు సంవత్సరాలలో పాలించిన డోన్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేఈ కోట్ల కుటుంబాలు అభివృద్ధి అనేది ఏమి చేయలేదని చెప్పుకుంటున్నాడని, మేము చేసిన అభివృద్ధి అనేది డోన్ నియోజకవర్గం ప్రజలను ఎవరిని అడిగిన చెబుతారని మేము చేసిన అభివృద్ధి పై గోడలు కట్టి నేను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన కి రాబోవు ఎన్నికల్లో కేఈ, కోట్ల, అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ విభేదాలన్నీ పక్కనపెట్టి రాబోవు ఎన్నికల్లో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలిపారు. ఈ బహిరంగ సభకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే తిక్కరెడ్డి, కోట్ల రాఘవేంద్ర, తేలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వర యాదవ్, డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ టి.యి.కేసన్న గౌడ్, మాజీ రాష్ట్ర పట్టణ అధ్యక్షులు ఫణిరాజ్, నంద్యాల జిల్లా పార్లమెంట్ అభ్యర్థి ఏవి సుబ్బారెడ్డి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, చిన్న మల్కాపురం బాలుడు, గుటుపల్లి ముల్ల ,బేతంచర్ల మండల అధ్యక్షుడు ఎల్ల నాగయ్య, బేతంచర్ల తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పిటిసి బుగ్గన లక్ష్మీ ప్రసన్న, నంద్యాల జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ టిడిపి నాయకులు రాఘవేందర్ రెడ్డి,డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీలం భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు యాదవ్, మర్రి రమన, ఓబులాపురం శేషిరెడ్డి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.