వచ్చే సార్వత్రిక ఎన్నికలకు హాలహార్వి మండలం సిద్ధం...
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు హాలహార్వి మండలం సిద్ధం...
ప్రచారంలో భాగంగా మండలంలోని గ్రామాలలో పర్యటిస్తున్న విరుపాక్షికి ప్రజలు బ్రహ్మ రథం
దేశ చరిత్రలోనే పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న
-ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి బుసినే విరూపాక్షి
ఆలూరు/హలహర్వి, మార్చి 07 (పీపుల్స్ మోటివేషన్):-
ఈరోజు ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం గూళ్యం,అమృతాపురం,బల్లూరు సిద్దాపురం గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన. విరుపాక్షి. అయన మాట్లాడుతూ పేదల మహిళల సాధికారత లక్ష్యంగా జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మీ అందరి ఆశీర్వాదాలు జగనన్నకు ఉండాలని కోరారు. అలా నేను మీ ఇంట్లో మనిషిని ఆలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే వారికి సహాయం చేస్తూ మీ ఇంట్లో మనిషిలాగ అందుబాటులో ఉంటున్నారన్నారు. అనునిత్యం మీ కుటుంబ సభ్యుడిలాగా మీతోనే ఉండే నన్ను ఆశీర్వదించాలన్నారు. ఎన్నికలు మరో 40రోజులలో సమీపిస్తుండడం నేడు కొత్త భిక్షగాల్లు వచ్చి ప్రతి గడపకు వెళ్లి లేని డ్రామాలాడుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాను అన్నారు. మీ అందరికి అందుబాటులో ఉంటానని మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా జగనన్న పై నాపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నకు తోడుగా ఉండాలని కోరారు. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ దుష్ట చతుష్టయం ఎన్ని ఆరోపణలు చేసిన 2024లో జగనన్నకు అండగా ఉండాలని కోరారు.
ముందుగా తమ గ్రామానికి వచ్చిన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి కి మండల వైఎస్సార్సీపీ నాయకులు,తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మరియు మండల నాయకులు, కార్యకర్తలు కన్వీనర్లు కో కన్వీనర్లు పాల్గొన్నారు.