విశాఖను డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా మార్చింది వైసీపీ
విశాఖను డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా మార్చింది వైసీపీ
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోయింది.
విదేశాల నుంచి పెట్టుబుడులు తీసుకుని రమ్మంటే జగన్ అండ్ కో డ్రగ్స్ తీసుకుని వస్తున్నారు
-టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి
నంద్యాల, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్):-
డ్రగ్ మాఫియా వల్ల యువత భవిత చిద్రమవుతోందని, ఈ డ్రగ్ మాఫియాకు మూలకారణం వైసీపీ ప్రభుత్వమేనని, నంద్యాల పార్లమెంట్ కూటమి అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటక విడుదల చేశారు. ఒకప్పుడు పరిశ్రమలకు చిరునామాగా ఉన్నఆంధ్ర ప్రదేశ్ ను డ్రగ్స్ కు కేంద్రం గా వైసీపీ ప్రభుత్వం మార్చినట్లు తెలిపారు. జగన్ పాలనలో డ్రగ్స్ దిగుమతికి నంబర్ 1 స్థానం లో నిలబడిందన్నారు.
విశాఖలో వేల కోట్లు విలువ చేసే కంటైనర్ లలో మత్తు పదార్థాలు లభ్యం అయ్యాయని తెలిపారు. 25 వేల కిలోల డ్రగ్స్ 50 వేల కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు. అంత విలువ చేసే కంటైనర్ ను ఆంధ్ర కి తీసుకురావడం సామాన్య విషయం కాదన్నారు. యువత భవితకు ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు అత్యంత ప్రమాదకరం అన్నారు. కల్తీ మద్యం , పనికి రాని బ్రాండ్ ల వల్ల, అక్రమ మద్యం వల్ల, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఏ దిశకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డి, జగన్ కలిసి ఇలాంటి అరాచక పనులు చేయడం సబబా? అన్నారు. ముఖ్యమంత్రికి, విజయ సాయి రెడ్డి కి, కూనం పూర్ణ చంద్ర రావు లకి , బ్రెజిల్ కి వీటన్నింటికీ, వీరికి, ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి? అని శబరి ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ కి, ముఖ్యమంత్రికి సంబంధాలు లేవా? అన్నారు. ఈ నెల 16 న ఈ తంతు జరిగితే 20 వరకు గోప్యం గా ఎందుకు ఉంచవలసి వచ్చిందన్నారు.
ఈ వ్యవహారం అంతా చేసి చంద్ర బాబు పై, లోకేష్ పై, చంద్రబాబుకి సపోర్ట్ చేసే పార్టీ నేతలపై బురద చల్లడం సిగ్గుచేటన్నారు. ఈ కుట్ర లో భాగస్వాములు బయటకు వస్తారన్నారు. డ్రగ్ రాకెట్ లో ఈ ప్రభుత్వ ప్రమేయం బయట పెడతాం అన్నారు.రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం లో అల్లర్లు సృష్టించడానికే ఇంత భారీ స్థాయిలో కుట్ర జరిపారన్నారు. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఇవి జరుగుతాయా? అన్నారు. భారత దేశ చరిత్ర లో మొట్ట మొదటి సారిగా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా జరిగిందన్నారు.
గంజాయి, డ్రగ్స్ లాంటి వాటితో యువత ను నిర్వీర్యం చేయడంలో వైసీపీ నాయకుల హస్తం లేదా అని శబరి ప్రశ్నించారు. విశాఖను రాజధానిని చేస్తాను అని నమ్మబలికిన జగన్ రెడ్డి... డ్రగ్స్ కి కేంద్రం గా మార్చారన్నారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి, ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.