-Advertisement-

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

General elections 2024, Loksabha elections 2024, General Elections News, General Elections Dates, General Elections faces, General Elections States,
Peoples Motivation

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

24 గంటలలోపు ప్రభుత్వ కార్యాలయాలలో, వసతి గృహాలలో వివిధ రకాల పథకాలకు సంబంధించిన  పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్, బ్యానర్ లను తీసివేయాలి...

-జిల్లా కలెక్టర్ డా జి.సృజన, 

-జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్

Kurnool Collector, Kurnool SP
కర్నూలు, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):- 

ఎన్నికలు పారదర్శకంగా , నిష్పక్షపాతంగా జరిగేందుకు, ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు.

శనివారం కలెక్టరేట్ లోని  కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తో కలిసి ఎన్నికల షెడ్యూల్‌పై జిల్లా కలెక్టర్ డా.జి.సృజన  జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్  నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్  శాసనసభకు, పార్లమెంట్ కు జరగబోయే  ఎన్నికలకు సంబందించిన ఎన్నికల షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్  ఏప్రిల్ 18వ తేదీన ఇవ్వనున్నారని, ఆ రోజు నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, ఏప్రిల్ 25 వ తేది నామినేషన్లు స్వీకరించడానికి చివరి తేదీ అని, ఏప్రిల్ 26వ తేదీన స్క్రూటినీ చేయడం జరుగుతుందన్నారు... ఏప్రిల్ 29 వ తేది నామినేషన్లు ఉపసంహరణ కు చివరి తేదీ అని తెలిపారు.. మే 13 వ తేదీన పోలింగ్ తేది కాగా,  జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేయడం జరుగుతుందన్నారు.. ఎన్నికల అనౌన్స్మెంట్ జరిగిన సమయం నుండి అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందన్నారు.. రానున్న 24 గంటల్లో అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ వసతి గృహాలలో, వివిధ అసోసియేషన్లలో, ఉన్న వివిధ రకాల పథకాలకు సంబంధించిన  పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్, బ్యానర్, ఫ్లాగ్, ఫోటో లు అన్నిటిని తీసివేయాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాలైనటువంటి బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రైల్వే బ్రిడ్జిల వద్ద, ప్రభుత్వ బస్సులు, ఎలక్ట్రిక్ పోల్స్,   మున్సిపల్ సమావేశ స్థలాల్లో అనధికార రాజకీయ ప్రకటనలు లాంటి గోడ రాతలతో  సహా,  పోస్టర్లను 48 గంటలకు తీసివేసి మోడల్ ప్రవర్తనా నియమావళిని అమలు చేసే విధంగా  చర్యలు తీసుకుంటామన్నారు.  ఇప్పటి నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లలో అడ్వర్టైజ్మెంట్లను ప్రభుత్వ ఖర్చుతో ప్రసారం చేయకూడదన్నారు..ప్రసారం చేస్తే రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి వ్యయం కింద పరిగణించడం జరుగుతుందన్నారు.

అదే విధంగా అధికారిక వెబ్‌సైట్ లలో రాజకీయ నాయకులు, మంత్రుల యొక్క ఫోటోలను ఎన్నికల కోడ్ అమలులోకి ఉండే వరకు  తీసివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రభుత్వ సివిల్ శాఖల విభాగాలు సివిల్ వర్క్స్ ఏవి మొదలుపెట్టారు, ఇంకా ఏవి మొదలుపెట్టలేదనే వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసి 72 గంటలలోపు  ఎన్నికల కమిషన్ వారికి పంపించాల్సి ఉంటుందన్నారు. మంత్రులు ఎవ్వరూ కూడా అధికారిక వాహనాలను ఉపయోగించడం ఉండదన్నారు. 

రాజకీయ పార్టీల మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్షించడం ఉండదన్నారు.

ఇప్పటినుండి కరెంట్ బిల్లులు ఇచ్చే వాటిల్లో  రాజకీయ నాయకుల బొమ్మలు ఉండకూడదన్నారు. పైలట్ కార్లు, ప్రభుత్వ అతిథి గృహాల్లో వసతి లాంటి సదుపాయం రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎవ్వరికీ ఇవ్వబడదన్నారు.

ఎంపి ల్యాడ్/ ఎమ్మెల్యే ల్యాడ్ కింద  అంబులెన్స్లు, వాటర్ ట్యాంక్ లు ఇచ్చి ఉంటే వాటి  మీద ఎంపి, ఎమ్మెల్యే ల ఫోటోలు తీసివేయడం జరుగుతుందని, తీయడానికి రాణి పక్షంలో  మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.. 

రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారాలలో, ర్యాలీలలో, సమావేశాల్లో గాని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు కూడా పాల్గొనకూడదనే డైరెక్షన్ ఎమ్ సిసి ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్ సిసి టీంలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పైన తెలిపిన అంశాలన్నీ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. షెడ్యూల్ ప్రకారం నామినేషన్లకు తీసుకొనుటకు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత నుండి ఇప్పటివరకు  20, 30,377 ఓటర్లు ఉన్నారని అందులో 10,01,971 మంది పురుషులు, 10,28,096 మంది స్త్రీలు ఉన్నారని, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు కర్నూలు జిల్లాలో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.అన్ని నియోజకవర్గాల్లో 1609 మంది  సర్వీస్ వైస్ ఎలక్టర్స్, 85 ఏళ్లకు పై బడిన ఓటర్లు 10,005 మంది ఓటర్లు, పి డ్బ్ల్యుడి  ఓటర్లు 4003 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, వీడియో సర్విలియాన్స్ టీమ్,  స్టాటిక్ సర్విలియాన్స్ టీమ్, వీడియో గ్రాఫర్లను, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీం లను  నియమించడం జరిగిందని వారందరికీ శిక్షణ తరగతులను కూడా ఇవ్వడం జరిగిందని, సంబంధిత టీములన్ని మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మెయింటెనెన్స్, ఎస్టాబ్లిష్మెంట్ కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 2204 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటికి సుమారుగా 17 వేల 800 మంది సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. అందుకు తగిన విధంగా సిబ్బందిని సిద్ధం చేసుకోవడం జరిగిందని, ఎన్నికల కమిషన్  అనుమతులు ఇవ్వగానే ఎన్నికలకు సంబంధించి డ్యూటీలు,  శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం  జరుగుతుందన్నారు. సెకండ్ ర్వాండమైజేషన్ చేసిన తర్వాత  ఎన్నికల కొరకు ఇంటర్మీడియట్ డిస్పాచ్ సెంటర్లను ఇస్తామని,  వివిధ నియోజకవర్గాలకు వివిధ డిస్పాచ్  సెంటర్ల నుండి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందని, అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాళ్లను  రాయలసీమ యూనివర్సిటీలో గుర్తించడం జరిగిందని ఎన్నికల కమిషన్ వారు ఎప్పుడు అడిగితే వారికి సంబంధిత ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజునుండి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తారని, ఎన్నికల కమిషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఉన్నదని, కర్నూలు జిల్లాకు   1800 425 7755 టోల్ ఫ్రీ నెంబర్, 08518-220125 అనే ల్యాండ్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఎక్కడైనా జరిగినట్లయితే పై తెల్పిన నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఎన్నికల సంఘం "నో రిపోల్ - జీరో వయోలెన్స్"(No Repoll - Zero Violence) అనే నినాదంతో ఎన్నికలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో మన జిల్లాలో 76 శాతం పోలింగ్ జరిగిందన్నారు.. అందులో కర్నూలు, అదోనిలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం జరిగిందన్నారు. స్వీప్ కార్యకలాపాల ద్వారా గత ఎన్నికల కంటే మెరుగ్గా పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా దృష్టి సారించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల కమీషన్ కూడా "Nothing like Voting, I Vote for Sure" అనే నినాదం ద్వారా యువ ఓటర్లు, పిడబ్ల్యూడి ఓటర్స్, మహిళ ఓటర్స్ లో చైతన్యం తీసుకొని రావడం ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. విధానపరమైన తప్పులు జరగకుండా చూడడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.

జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ... ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను 3 కంపెనీల పారామిలటరీ భద్రతా బలగాలు జిల్లాకు రావడం జరిగిందన్నారు. సదరు భద్రతా బలగాలు మూడు సబ్ డివిజనల్లలో క్యాంప్ చేస్తూ రూట్ మార్చ్, ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి 7 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను గుర్తించడం జరిగిందని అందులో తెలంగాణ (గద్వాల), కర్ణాటక (బళ్లారి, రాయచూరు) మనకు సరిహద్దులుగా ఉన్నాయన్నారు. చెక్ పోస్టుల ద్వారా మద్యాన్ని నియంత్రించడానికి గాను సిసి కెమెరాల ద్వారా లైవ్ ఫీడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసుకొని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. గత డిసెంబర్ నుంచి 13 వేల లీటర్ల ఎన్డిపిఎల్ (NDPL), 5 కోట్ల నగదు జప్తు చేయడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరుగుతుందన్నారు. సివిల్ పోలీసుల వైపు నుంచి గత 6 నెలల నుంచి పల్లెలో పర్యటిస్తూ పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా కొన్ని చోట్ల ఇబ్బంది కలిగించే వారిని గుర్తించి బైండ్ ఓవర్ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ వారి సహకారంతో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, సమాచార శాఖ ఉప సంచాలకులు జయమ్మ,  మీడియా నోడల్ అధికారి వెంకట లక్ష్మమ్మ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-