కోడి కత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ... అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ..
కోడి కత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ...
అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ
జైభీమ్ భారత్ పార్టీలో చేరిక
విజయవాడ, (పీపుల్స్ మోటివేషన్):-
వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగనై పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పార్టీలోకి కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు.
వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే అతను బెయిలు పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే.