ఏసీబీకి పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఏసీబీకి పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్
గంగాధర నెల్లూరు/ కార్వేటినగరం, (పీపుల్స్ మోటివేషన్):-
కార్వేటినగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు. ఎమ్మార్వో ఆఫీస్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రెడ్డప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన కథనం ప్రకారం... స్థానిక ముస్లిం కాలనీకి చెందిన రఫీ తన బంధువుల వ్యవసాయ భూమి పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. అందుకు ఆర్ఐ రెడ్డప్ప ను సంప్రదించగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇతడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు పథకం ప్రకారం రఫీ తో 12 వేల 500 రూపాయలు తీసుకెళ్లాడు. ఆర్ ఐ ఆ నగదును కార్యాలయం బయట ఉన్నా దగ్గరకు తీసుకురావాలని చెప్పడంతో రఫీ అక్కడికి వచ్చి ఇతడికి ఇస్తుండగా ఆ నగదు ను పక్కనే ఉన్న ద్విచక్ర వాహనంలో పెట్టాలని సూచించాడు. అంతలోనే ఏసీబీ అధికారులు ఏ ఎస్ పి దేవ ప్రసాద్ డి.ఎస్.పి డిఎస్పి జెస్సి ప్రశాంతి వారి బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.12 వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.