కొన్ని గంటల్లో పెళ్లి... అంతలో హత్యకు గురయిన వరుడు...
కొన్ని గంటల్లో పెళ్లి... అంతలో హత్యకు గురయిన వరుడు...
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-దక్షిణ ఢిల్లీలో జిమ్ కోచ్ గౌరవ సింఘాల్ (29) హత్యకు గురయ్యారు. తెల్లవారితే అతడి పెళ్లి ఈ సమయంలోనే తండ్రి చేతిలో హత్యకు గురవడం సంచలనంగా మారింది. గౌరవ సింఘాల్ ని అతని తండ్రి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల అరెస్ట్ చేసినట్లు శుక్రవారం తెలిపారు. గౌరవ్ తనను రోజు తిడుతుంటే వాడని ఆ కోపంతో రంగలాల్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని తన ఇంట్లో అర్ధరాత్రి జరిగింది. హత్య తర్వాత పరారీ లో ఉన్న నిందితుడు రంగలాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామన్నారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పోలీసులకు హత్య గురించి ఫోన్ వచ్చింది సంఘటన స్థలానికి వెళ్లేసరికి రక్తపు మడుగులో బాధితుడు పడి ఉన్నాడు. తడి ముఖం మీద శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. హత్య తర్వాత మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గౌరవ పెళ్లి వేడుక గురువారం జరగాల్సి ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అయితే గౌరవం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులతో పెళ్ళికి అంగీకరించాడని అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ విషయమై గౌరవ్ తన తండ్రితో పలుమార్లు వాగ్వాదానికి దిగాడని ఈక్రమంలోనే తన తండ్రిని చేయిచేసుకున్నాడని దీంతో కోపోద్రిక్తుడైన రంగాలాల్ తన ముగ్గురు సహచరులతో కలిసి గౌరవ్ హత్య చేసి రూ.50 లక్షలు నగదు రూ. 15 లక్షల విలువైన బంగారంతో ఇంటి నుంచి పారిపోయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.