ధర్మవరంలో పోటీ చేసేది నేనే, టీడీపీ జెండా ఎగురవేసేది నేనే..
ధర్మవరంలో పోటీ చేసేది నేనే, టీడీపీ జెండా ఎగురవేసేది నేనే
ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు
గాలి మాటలు అసలే పట్టించుకోవద్దు
ధర్మవరం నియోజవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు
రావులచెరువు గ్రామంలో పర్యటన.. పరిటాల శ్రీరామ్
వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీచేసేది నేనే.. ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేసేది కూడా నేనేనని నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. మధ్యలో ఎవరో మాట్లాడే గాలి మాటలు అసలు పట్టించుకోవద్దని.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. బాబు సూపర్ -6 కార్యక్రమంలో భాగంగా ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా గ్రామానికి వచ్చిన శ్రీరామ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా కాలుస్తూ.. పూల వర్షం కురిపిస్తూ, గజమాలలతో శ్రీరామ్ కు స్వాగతం లభించింది. అనంతరం శ్రీరామ్ ఇంటింటికీ వెళ్తూ సూపర్-6 పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీరామ్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని.. అలాగే గ్రామానికి డబుల్ రోడ్డు వేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మరికొన్ని సమస్యలు కూడా శ్రీరామ్ దృష్టికి తెచ్చారు. దీనిపై శ్రీరామ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయ్యాక మొదటగా మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ద్వారా వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నన్ను మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగానో నాయకుడిగానో చూడవద్దని.. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే.. మీకు ఏపని కావాలో నా దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా అడిగి చెయించుకునే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుందన్నారు. ధర్మవరంలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని... కచ్చితంగా ఈ సారి టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు....