టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్...?
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్...?
తెలంగాణ ప్రభుత్వం టెట్ రాసే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెంచిన టెట్ ఫీజును తగ్గించనున్నట్లు సమాచారం. ఫీజుల పెంపు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ఒక పేపర్ కు రూ.200 ఉండగా దానిని రూ. 1000, రెండు పేపర్లకు రూ.300 ఉండగా దానిని రూ.2000 వరకు పెంచారు. దాదాపు 3 లక్షల మంది టెట్ రాయనున్నారు.
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరంలేదు: విద్యాశాఖ
తెలంగాణ ప్రభుత్వం టీచర్లు టెట్ రాయడానికి విద్యాశాఖ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆ శాఖ కమిషనర్ శ్రీదేవసేన స్పష్టం చేశారు. టెట్ రాసేందుకు టీచర్లు అనుమతి తీసుకోవాలని 2 రోజుల క్రితం టెట్ కన్వీనర్ చెప్పిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో టీచర్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రీదేవసేన తెలిపారు. కాగా టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. కాగా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు HMలుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే..